వడదెబ్బతో బాధపడుతున్న మహిళకు అంబులెన్స్ ఇవ్వని ఆసుపత్రి.. రైల్వే స్టేషన్‌లోనే మృతి...

Published : Apr 21, 2023, 03:59 PM IST
వడదెబ్బతో బాధపడుతున్న మహిళకు అంబులెన్స్ ఇవ్వని ఆసుపత్రి.. రైల్వే స్టేషన్‌లోనే మృతి...

సారాంశం

వడదెబ్బతో బాధపడుతున్న మహిళకు అంబులెన్స్ ఇవ్వకపోవడంతో రైల్వేస్టేషన్ లోనే ఆ మహిళ మృతి చెందింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్ లో చోటు చేసుకుంది. 

పశ్చిమ బెంగాల్‌ : పశ్చిమ బెంగాల్‌లో ఓ అమానవీయ ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యంతో ఓ మహిళ రైల్వేస్టేషన్ లో మృతి చెందిన ఘటన వెలుగు చూసింది. పశ్చిమ బెంగాల్ లోని  పుర్బా బర్ధమాన్ జిల్లాలోని రైల్వే స్టేషన్‌లో ఒక మహిళ వడదెబ్బతో చనిపోయింది. అయితే, ఆమెను మరింత మెరుగైన చికిత్స కోసం వైద్యులు పెద్దాసుపత్రికి రెఫర్ చేశారు. అయితే, ప్రస్తుతం ఆమె చికిత్స తీసుకుంటున్న ఆస్పత్రి అంబులెన్స్‌ను అందించడంలో విఫలమైందని పోలీసులు తెలిపారు.

వివరాల్లోకి వెడితే.. 50 ఏళ్ల మేనకా కోడా, ఆమె భర్త అసిత్ చికిత్స కోసం బర్ధమాన్‌కు రైలులో వెళ్లడానికి  ఎదురుచూస్తుండగా..  భటర్ రైల్వే స్టేషన్‌లో ఈ సంఘటన జరిగింది. "కచిగోరియా గ్రామంలో దినసరి కూలీగా మేనకా పనిచేస్తోంది. అలా ఓ పొలంలో తన భర్తతో కలిసి పని చేస్తున్నప్పుడు మేనకా కోడా హీట్ స్ట్రోక్‌ బారిన పడింది. దీంతో ఆమె భర్త ఆమెను భాతర్ ఆసుపత్రికి తీసుకువచ్చాడు, అక్కడ ఆమెకు రెండు సెలైన్ బాటిళ్లు ఎక్కించారు. ఆ తరువాత బర్ధమాన్ మెడికల్ కాలేజ్, ఆసుపత్రికి రెఫర్ చేశారు" అని ఒక పోలీసు అధికారి చెప్పారు.

స్మశానంలో శవంపై గ్యాంగ్ రేప్.. పాతిపెట్టిన మృతదేహాన్ని వెలికితీసి దారుణం..

"అయితే, ఆసుపత్రి అధికారులు ఆమెకు అంబులెన్స్‌ను ఇవ్వలేదు. ఆమెను ప్రైవేట్ వాహనంలో బర్ధమాన్ కు తీసుకెళ్లమని ఆమె భర్తను కోరారు. వారి దగ్గర అంత డబ్బు లేకపోవడంతో.. వేరే మార్గం లేక, అసిత్ కోడా ఆమెను బర్ధమాన్ కు రైలులో తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నాడు. రైలు వరకు ఆమెను ఈ-రిక్షాలో రైల్వే స్టేషన్‌కు తీసుకువెళ్లారు. అలా గురువారం రైలు కోసం వేచి ఉండగా చెట్టు కిందే మరణించింది," అని చెప్పారు. 

ఆసుపత్రి అధికారుల నిర్లక్ష్యం, ఉదాసీనత వల్లే ఆమె చనిపోయిందని తెలిసి స్థానికుల్లో ఆగ్రహం కట్టలు తెంచుకుంది. దీనిమీద ఆస్పత్రి వర్గాలు మాట్లాడుతూ తమ అంబులెన్స్ చెడిపోయిందని, మరమ్మతులు చేస్తున్నామని ఆసుపత్రి అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనపై ఆరోగ్య శాఖ విచారణ ప్రారంభించింది. ఈ ఏడాది జనవరిలో జల్‌పైగురిలో జరిగిన ఇలాంటి దుర్ఘటనను ఈ ఘటన గుర్తు చేసింది. జల్పాయిగురి కేసులో ఒక వ్యక్తి తన తల్లి మృతదేహాన్ని కిలోమీటరు వరకు మోసుకెళ్లవలసి వచ్చింది, ఆమె మృతదేహాన్ని తరలించడానికి అంబులెన్స్ రూ. 3,000 డిమాండ్ చేసింది.
 

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu