
పాశ్చాత్య దేశాల మాదిరిగా భారతదేశంలో కేవలం పెళ్లి అంటే ఇద్దరు వ్యక్తులు ఒక్కటవడంగా భావించరు. ఇరు కుటుంబాల కలయికగా భావిస్తారు. అందుకే ఇక్కడ, ముఖ్యంగా ఆరేంజ్డ్ మ్యారేజ్ లలో ఇరు కుటుంబాల నేపథ్యాలను నిశితంగా పరిశీలిస్తారు. తరువాత పెళ్లి నిశ్చయిస్తారు. కొన్ని సార్లు ఆయా కుటుంబ పెద్దల, ఇతర వ్యక్తుల ప్రవర్తన వల్ల కూడా పెళ్లి రద్దయిన పరిస్థితులు ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఓ వరుడు తన కాబోయే అత్త ప్రవర్తన వల్ల పెళ్లి రద్దు చేసుకున్నాడు. పెళ్లికి ముందు ఆమె సిగరెట్ తాగుతూ, డ్యాన్స్ చేయడమే దానికి కారణం. అయితే ఇది ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
బాలాసోర్ రైలు ప్రమాద ఘటన.. మరో 13 మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించిన సిబ్బంది
వివరాలు ఇలా ఉన్నాయి. యూపీలోని సంభాల్ జిల్లాకు చెందిన ఓ యువకుడికి రాజ్‌పురాకు చెందిన అమ్మాయితో పెళ్లి నిశ్చయమైంది. జూన్ 27న వీరి పెళ్లి జరగాల్సి ఉంది. దీనికి ముందు కాబోయే జంట కొన్ని కార్యక్రమాలు నిర్వహించాల్సి ఉంది. అందులో భాగంగా వరుడు పూజా కార్యక్రమాల కోసం మండపం వద్ద ఎదురుచూస్తున్నాడు. అయితే వదువు తరఫు కుటుంబ సభ్యులు ఆ ప్రాంతంలో గుమిగూడి డ్యాన్స్ లు చేస్తూ సంబరాలు జరుపుకుంటున్నారు.
మణిపూర్ జాతి హింసలో విదేశీ హస్తం ఉండొచ్చు - సీఎం బీరెన్ సింగ్
ఈ సమయంలోనే ఊహించని పరిణామం చోటు చేసుకుంది. వధువు తల్లి సిగరెట్ తాగుతూ డ్యాన్స్ చేస్తూ ఆ గుంపులోకి చేరింది. ఈ దృశ్యాన్ని వరుడు చూసి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాడు. దీంతో చేస్తున్న పూజలు నిలిపేసి పెళ్లి రద్దు చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. వరుడి నిర్ణయంతో ఇరు కుటుంబాల మధ్య వివాదం తలెత్తింది. చివరికి ఆ పెళ్లి వేడుకలు ఆగిపోయాయి.
ట్విట్టర్ యూజర్లకు షాక్.. చదివే పోస్టులపై పరిమితులు విధించిన ఎలాన్ మస్క్.. ఎవరెవరికీ ఎంతంటే ?
దీంతో ఇరు కుటుంబాలు తీవ్ర నిరాశకు లోనయ్యాయి. అయితే ఇరు కుటుంబాల మధ్య సమస్యను పరిష్కరించేందుకు పెద్దలు చొరవ చూపి, పంచాయతీ నిర్వహించారు. కుటుంబాల మధ్య రాజీ కుదర్చడానికి చేసిన ప్రయత్నం సఫలమయ్యింది. పెద్దలు తిరిగి ఆ వధూవరులిద్దరికీ పెళ్లి నిశ్చయించారు.