రాహుల్ ను ప్రజలు తిరస్కరిస్తారు: వైట్‌హౌస్ అధికారిక గాయనీ మేరి మిల్ బెన్

Published : Jul 02, 2023, 10:40 AM IST
 రాహుల్ ను ప్రజలు తిరస్కరిస్తారు: వైట్‌హౌస్ అధికారిక  గాయనీ  మేరి మిల్ బెన్

సారాంశం

కాంగ్రెస్ పార్టీ  అగ్రనేత  రాహుల్ గాంధీ పై  వైట్ హౌస్  అధికారిక గాయనీ మేరీ మిల్ బెన్  విమర్శలు  చేశారు. తమ దేశం గురించి  వ్యాఖ్యలు  చేసిన  రాహుల్ గాంధీ తీరును  మిల్ బెన్ తప్పుబట్టారు.

న్యూఢిల్లీ:  కాంగ్రెస్ పార్టీ అగ్రనేత  రాహుల్ గాంధీపై  అమెరికా వైట్ హౌస్ అధికారి గాయని మేరీ మిల్ బెన్  విమర్శలు  చేశారు.  ఇండియా గురించి  రాహుల్ గాంధీ  చేసిన విమర్శలపై  ఆమె స్పందించారు. స్వంత  దేశం గురించి  రాహుల్ గాంధీ  చేసిన వ్యాఖ్యలను  ఇండియా ప్రజలు అంగీకరిస్తారా  అని  ఆమె ప్రశ్నించారు.  ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు  చేశారు.   అమెరికా పర్యటనలో  రాహుల్ గాంధీ  చేసిన వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా తప్పు బట్టారు.

 తమ దేశం గురించి  బాగా మాట్లాడని  నాయకుడికి  ఓటు  వేయడం  ఏ దేశ పౌరులకు  ఇష్టం ఉండదని ఆమె  అభిప్రాయపడ్డారు. తన దేశ  వారసత్వాన్ని  గౌరవించడం నాయకుడి లక్షణమన్నారు.  ఇండియా ప్రధాని నరేంద్ర మోడీ  తన దేశాన్ని గౌరవిస్తారని  ఆమె గుర్తు  చేశారు. కానీ రాహుల్ గాంధీ మాత్రం అందుకు విరుద్దంగా వ్యవహరించారన్నారు.గత మాసంలో  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  అమెరికాలో పర్యటించారు.ఈ సమయంలో  వైట్ హౌస్ లో   మేరీ మిల్ బెన్ జాతీయ గీతాన్ని ఆవిష్కరించారు.  

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Beautiful Railway Stations : ఇండియాలోని 6 అత్యంత అందమైన రైల్వే స్టేషన్లు ఇవే
ఎక్స్‌ప్రెస్‌వేల నుంచి ఎయిర్‌పోర్ట్‌ల దాకా... ఉద్యోగాలే ఉద్యోగాలు