
వాళ్లిద్దరు ప్రేమికులు. కొంత కాలంగా సహజీవనం చేస్తున్నారు. పెళ్లి చేసుకోవాలని భావించారు. కానీ ఆ ప్రియుడు దానిని పదే పదే వాయిదా వేస్తూ వస్తున్నాడు. దీంతో కోపం తెచ్చుకున్న ప్రియురాలు అతడిని చంపేసింది. అనంతరం పోలీసుల ఎదుట లొంగిపోయింది. ఈ దిగ్భ్రాంతికరమైన ఘటన మహరాష్ట్రలోని ముంబైలో చోటు చేసుకుంది.
సోనాలి ఫోగట్ హత్య కేసులో 5వ అరెస్ట్.. సీబీఐ విచారణ చేపట్టాలన్న సీఎం
‘‘ది ఇండియన్ ఎక్స్ ప్రెస్’’ నివేదించిన వివరాల ప్రకారం..పోవైకి చెందిన 32 ఏళ్ల మహిళ జోరా షా, రంజాన్ షేక్ లు ఇద్దరూ దాదాపు ఏడాది కాలంగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. అతడు ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అయితే మహిళ గత కొంత కాలంగా తనను పెళ్లి చేసుకోవాలని ప్రియుడిని కోరుతోంది. కానీ అతడు దానిని ఆపుతున్నాడు. కొన్ని రోజుల తరువాత చేసుకుందామని చెబుతున్నాడు. ఇలా పదే పదే పెళ్లి వాయిదా పడుతూ వస్తోంది. దీంతో వీరిద్దరి మధ్య నిరంతరం గొడవలు జరుగుతూనే ఉన్నాయి.
గుజరాత్ భుజ్ లో మోడీ రోడ్ షో: ప్రధాని రాక కోసం ఎదురు చూసిన ప్రజలు
దీంతో అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని జోరా షా భావించింది. దీని కోసం ఆగస్టు 27వ తేదీన తనతో పాటు పోలీస్ స్టేషన్ కు రావాలని రంజాన్ షేక్ ను కోరింది. దీనికి అతడు కూడా అంగీకరించాడు. ఇద్దరు కలిసి పోలీసు స్టేషన్ కు కూడా బయలుదేరారు. అయితే మధ్యలో షేక తన నిర్ణయాన్ని మార్చుకున్నాడు. తాను పోలీసు స్టేషన్ కు రానని ఆమెకు చెప్పాడు. దీంతో కోపంతో ఊగిపోయిన షా తన దుపట్టాతో అతడి గొంతు నులిమింది. దీంతో ఊపిరాడక రంజాన్ షేక్ చనిపోయాడు.
అతడు చనిపోయిన తరువాత ఆ మహిళ వెళ్లి పోవై పోలీసుల ఎదుట లొంగిపోయింది. దీంతో పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం హాస్పిటల్ కు తీసుకెళ్లారు. నిందితురాలని ఆరే పోలీసులకు అప్పగించారు.
పోక్సో కేసుల్లో బాధితుల కోసం మహిళా న్యాయవాదులను నియమించండి - అలహాబాద్ హైకోర్టు
ఇటీవల ఘజియాబాద్ లో కూడా ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఫీరోజ్, ప్రీతి శర్మ అనే జంట సహ జీవనం చేసుకునేవారు. అయితే ఏం జరిగిందో తెలియదు గానీ శర్మ ఫిరోజ్ ను కత్తితో గొంతు కోసి చంపేసింది. అనంతరం ట్రాలీ బ్యాగులో మృతదేహాన్ని ఉంచి, దానిని పారేయడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో పోలీసులు ఆమెను పట్టుకున్నారు. అనంతరం అరెస్టు చేశారు.