సిలిండర్ లీకేజీతో చెలరేగిన మంటలు.. ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం.. మృతుల్లో నలుగురు చిన్నారులు..

By team teluguFirst Published Jan 14, 2023, 9:08 AM IST
Highlights

గ్యాస్ సిలిండర్ లీకేజీ అవడంతో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సభ్యులు సజీవదహనం అయ్యారు. ఇందులో నలుగురు చిన్నారులు ఉన్నారు. ఈ కుటుంబం పశ్చిమ బెంగాల్ నుంచి వలస వచ్చి హర్యానాలోని పానిపట్ లో నివసిస్తోంది. 

వంట గ్యాస్ సిలిండర్ లీకేజీ కావడంతో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. ఈ ఘోరమైన ఘటన హర్యానా రాష్ట్రంలో జరిగింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. హర్యానా రాష్ట్రంలోని పానిపట్ జిల్లా బిచ్‌పరి గ్రామ సమీపంలోని తహసీల్ క్యాంపు ప్రాంతంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఆరుగురు చనిపోయారని, వారిలో ఇద్దరు దంపతులు, మిగిలిన నలుగురు వారి పిల్లలు అని పానిపట్‌ తహసీల్ క్యాంప్ పోలీస్ స్టేషన్‌లోని ఎస్‌హెచ్‌ఓ ఇన్‌స్పెక్టర్ ఫూల్ కుమార్ వార్తా సంస్థ ‘పీటీఐ’కి తెలిపారు.

ముంబైలో మహిళపై యాసిడ్ దాడి.. నిందితుడి అరెస్ట్..

సిలిండర్ లీక్ కావడంతో ఇంటికి మంటలు అంటుకున్నాయని పేర్కొన్నారు. ఈ కుటుంబం పశ్చిమ బెంగాల్ నుంచి వలస వచ్చిందని చెప్పారు. ఈ దంపతులు పానిపట్‌లోని ఓ ఫ్యాక్టరీలో పనిచేసేవారని తెలిపారు. 

ఈ ఘటన సమయంలో ఇంట్లో నుంచి పొగలు రావడాన్ని గమనించిన ఇరుగుపొరుగు వారు పోలీసులకు, అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. అయితే రెస్క్యూ టీం అక్కడికి వచ్చి కాపాడే ప్రయత్నం చేసినా.. అప్పటికే బాధితులు సజీవదహనం అయ్యారు. బాధితులను 45 ఏళ్ల అబ్దుల్, అతడి 40 ఏళ్ల భార్య, 18, 16 ఏళ్ల ఇద్దరు కుమార్తెలు, 12, 10 ఏళ్ల ఇద్దరు కుమారులుగా గుర్తించారు.

'ఆదిపురుష్' పై మరో వివాదం.. సర్టిఫికేట్ లేకుండా టీజర్‌ విడుదల.. సెన్సార్ బోర్డును వివరణ కోరిన కోర్టు

రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లోని భుంగ్రా గ్రామంలో గత నెల 9వ తేదీన ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. పెళ్లి వేడుకల సందర్భంగా గ్యాస్ సిలిండర్లు పేలాయి. దీంతో భారీగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో నలుగురు మరణించారు. ఇందులో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. 50 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు వెంటనే జోధ్ పూర్ హాస్పిటల్ కు తరలించారు. ఈ ఘటనలో 35 మందికి పైగా 60 శాతానికి పైగా గాయాలయ్యాయి. 11 మందికి 80 నుండి 90 శాతం కాలిన గాయాలు ఉన్నాయి.

అదృశ్యమైన మహిళా క్రికెటర్.. అనుమాన‌స్ప‌ద రీతిలో.. చెట్టుకు వేలాడుతూ మృతదేహం

పెళ్లి వేడుకల జరుగుతున్న సమయంలో ఒక్క సారిగా గ్యాస్ సిలిండర్ పేలడంతో ఘటనా స్థలంలో గందరగోళం నెలకొంది. ఒక్క సారిగా అగ్ని చెలరేగడంతో టెంట్ కిందట ఉన్న మహిళలు, చిన్నారులకు మంటలంటుకున్నాయి. ఘటనపై సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు అక్కడికి చేరుకున్నారు. సమీపంలోని ట్యాంకర్ల సహాయంతో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. దీంతో పాటు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ప్రమాద సమయంలో తొక్కిసలాట జరిగింది. 
 

click me!