గోవాలో బీజేపీని ఓడించే సత్తా కాంగ్రెస్ కే ఉంది- కాంగ్రెస్ నాయకుడు చిదంబరం

By team telugu  |  First Published Dec 26, 2021, 3:41 PM IST

గోవాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు చిదంబరం అన్నారు. బీజేపీని ఎదుర్కొనే శక్తి ఒక్క కాంగ్రెస్ కు మాత్రమే ఉందని తెలిపారు. గోవా ఎన్నికల నేపథ్యంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 


GOA ELACTIONS : గోవాలో అధికార బీజేపీని ఓడించే సత్తా ఒక్క కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చిదంబరం అన్నారు. రాబోయే గోవా అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తృణమూల్ కాంగ్రెస్ (TMC), ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)లు బీజేపీయేత‌ర ఓట్ల‌ను చీల్చ‌డానికి మాత్ర‌మే పని చేస్తున్నాయని విమర్శించారు.  గోవాలోని మొత్తం 40 నియోజకవర్గాలున్నాయని అన్నారు. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ క్షేత్ర స్థాయిలో బలంగా ఉంద‌ని అన్నారు. బీజేపీ ధ‌న‌బ‌లాన్ని, రాజ్యాధికారాన్ని ఉప‌యోగించినా కాంగ్రెస్ పార్టీయే గెలుస్తుంద‌ని తెలిపారు. ఈ విష‌యం ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌ని చెప్పారు. ఓట‌ర్లు కోరుకునే వారినే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్య‌ర్థులుగా ఎంపిక చేస్తుంద‌ని అన్నారు. అప్పుడే ఎన్నికైన ఆ ఎమ్మెల్యేలు ఓట‌ర్లకు విధేయులుగా ఉంటార‌ని తెలిపారు. 

పంచాయతీ ఎన్నికల రద్దు.. ఆ ఆర్డినెన్స్‌ను ఉపసంహరించుకున్న మధ్యప్రదేశ్ సర్కార్

Latest Videos

undefined

గోవాలో వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఎన్నిక‌లు..
గోవా శాస‌న‌స‌భకు 2022 ఫిబ్ర‌వ‌రిలో ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఆ రాష్ట్ర శాస‌న‌స‌భ‌లో 40 మంది స‌భ్యులు ఉన్నారు. వారి ఎన్నిక కోసం వ‌చ్చే ఏడాది ఫిబ్ర‌వ‌రిలో ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని కేంద్ర ఎన్నిక‌ల సంఘం భావిస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఎన్నిక‌ల షెడ్యూల్ ఇంకా అధికారికంగా ప్ర‌క‌టించ‌లేదు. గోవాలో ప్రస్తుతం కొన‌సాగుతున్న శాసనసభ పదవీకాలం మార్చి 15, 2022తో ముగియనుంది. గోవాలో ప్ర‌స్తుతం బీజేపీ అధికార పార్టీగా ఉంది. ఇక్క‌డ ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీగా కాంగ్రెస్ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఇప్పుడు ఎన్నిక‌లు జ‌రిగినా ఆ రెండు పార్టీల మ‌ధ్యే ప్ర‌ధాన పోటీ ఉండే అవ‌కాశం ఉంది. ఆ రెండు పార్టీలు ఇత‌ర మిత్ర‌ప‌క్షాల స‌హ‌కారం పొందేందుకు ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే ఇక్క‌డ తృణ‌ముల్ కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ కూడా పోటీ చేయాల‌ని భావిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ఆ పార్టీల‌ను ఉద్దేశించి కేంద్ర మాజీ మంత్రి చిదంబ‌రం వ్యాఖ్య‌లు చేశారు. కాంగ్రెస్ పార్టీలో సీనియ‌ర్ నాయ‌కుడు అయిన చిదంబరం ఆ పార్టీ నుంచి గోవాకు ఎన్నిక‌ల ఇన్‌ఛార్జ్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 

జమ్మూకాశ్మీర్‌లో ఆరుగురు ఉగ్రవాదులు ఖతం

ఎన్నిక‌లకు ముందు మారుతున్న రాజకీయ ప‌రిణామాలు..
ఎన్నిక‌ల స‌మీపిస్తున్న కొద్దీ పార్టీల నుంచి రాజీనామాలు, ఒక పార్టీ నుంచి మ‌రొక పార్టీల‌కు మారిపోతున్నారు. కీల‌క రాజ‌కీయ ప‌రిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ క్ర‌మంలోనే గోవాలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి పెద్ద ఎదురుదెబ్బ తగిలింది, మ‌రో రెండు నెల‌ల్లో ఎన్నిక‌లు ఉండ‌గానే ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే లావూ మమ్లేదార్‌తో సహా ఐదుగురు నాయకులు పార్టీకి రాజీనామా చేశారు. అలాగే అధికార‌ బీజేపీకి చెందిన‌ ఎమ్మెల్యే ఒక‌రు కూడా ఆ పార్టీకి వారం రోజుల క్రితం రాజీనామా చేశారు. ఎమ్మెల్యే కార్లోస్ అల్మైదా పార్టీ ప్రాథ‌మిక స‌భ్య‌త్వానికి ముందుగా రాజీనామా చేశారు. అనంత‌రం ఆ లేఖ‌ను అసెంబ్లీ సెక్ర‌ట‌రీకి పంపించారు. అనంత‌రం ఎమ్మెల్యే స‌భ్య‌త్వానికి కూడా రాజీనామా చేశారు. గ‌త కొన్ని రోజుల నుంచి ఇప్ప‌టి వ‌ర‌కు ఏడుగురు ఎమ్మెల్యేలు త‌మ శాస‌న స‌భ స‌భ్య‌త్వానికి రాజీనామాలు చేశారు. ఎన్నిక‌లకు దాదాపు ఇంకా రెండు నెల‌లు స‌మ‌యం ఉంది. మ‌రి ఈలోపు ఇంకా ఎన్ని ప‌రిణామాలు చోటు చేసుకుంటాయో తెలియాలంటే వేచిచూడాల్సిందే. 

click me!