జమ్మూకాశ్మీర్‌లో ఆరుగురు ఉగ్రవాదులు ఖతం

By Siva Kodati  |  First Published Dec 26, 2021, 3:05 PM IST

జమ్మూకాశ్మీర్‌లో (jammu and kashmir) పోలీసులు (police), భద్రతా దళాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో గత 48 గంటల్లో  ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. ఈ ఆరుగురిలో ఇటీవల బిజ్బెహరా పోలీస్ స్టేషన్ సమీపంలో ఏఎస్సై మహ్మద్ అష్రఫ్‌ను హత్య చేసిన ఉగ్రవాది కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు


జమ్మూకాశ్మీర్‌లో (jammu and kashmir) పోలీసులు (police), భద్రతా దళాలు సంయుక్తంగా చేపట్టిన ఆపరేషన్‌లో గత 48 గంటల్లో  ఆరుగురు ఉగ్రవాదులను హతమార్చాయి. అనంత్‌నాగ్‌లోని (ananth nag) కలాన్ సిర్గుఫ్వారా గ్రామంలో ఒక ఉగ్రవాది ఉన్నాడని విశ్వసనీయ సమాచారం మేరకు కార్డన్ సెర్చ్ ఆపరేషన్‌ను (carden search) శనివారం ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు. అయితే ఉగ్రవాదిని లొంగిపోవాలని కోరినా వినకుండా విచక్షణారహితంగా పోలీసులు, భద్రతా దళాలపై కాల్పులు తెగబడ్డాడు.

Also Read:జమ్మూకాశ్మీర్ లో ఎన్‌కౌంట‌ర్.. ఐఎస్ జేకే ఉగ్ర‌వాది హ‌తం

Latest Videos

దీంతో భద్రతా సిబ్బంది జరిపిన ఎదురుకాల్పుల్లో ఉగ్రవాది హతమయ్యాడు. గడిచిన 48 గంటల్లో నాలుగు ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో ఆరుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఈ ఆరుగురిలో ఇటీవల బిజ్బెహరా పోలీస్ స్టేషన్ సమీపంలో ఏఎస్సై మహ్మద్ అష్రఫ్‌ను హత్య చేసిన ఉగ్రవాది కూడా ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. డిసెంబరు 22వ తేదీన బిజ్‌బెహరా పోలీస్‌ స్టేషన్ బ‌య‌ట విధుల్లో ఉన్న ఏఎస్ఐ అష్రఫ్ ను ఉగ్ర‌వాదులు హతమయ్యారు. కొన్నిగంట‌ల ముందు పాత శ్రీనగర్ నగరంలోని మిర్జన్‌పోరా పరిసరాల్లో ఇంట్లో ఉన్న రౌఫ్ అహ్మద్ అనే పౌరుడిని ఉగ్ర‌వాదులు చంపేశారు. 

click me!