జమ్మూకాశ్మీర్ విషయంలో మోడీ-షా మరో కీలక నిర్ణయం..?

By Siva KodatiFirst Published Jun 13, 2021, 2:54 PM IST
Highlights

జమ్మూకశ్మీర్ విషయంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అతి తర్వలోనే జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించి, ఎన్నికలను నిర్వహించే దిశగా మోడీ పావులు కలుపుతున్నారు

జమ్మూకశ్మీర్ విషయంలో నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. అతి తర్వలోనే జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్ర హోదా కల్పించి, ఎన్నికలను నిర్వహించే దిశగా మోడీ పావులు కలుపుతున్నారు. ఈ రెండు అంశాలపై అక్కడున్న అన్ని రాజకీయ పార్టీలను కూడగట్టి, వారి అభిప్రాయాలను తీసుకోనుంది. అయితే ఇప్పటి వరకూ దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

2018 లో మెహబూబా ముఫ్తీ ఎన్‌డీఏ నుంచి వైదొలగిన తర్వాత కేంద్రం అక్కడ రాష్ట్రపతి పాలన విధించింది. అప్పటి నుంచి అక్కడ రాజకీయ కార్యకలాపాలు స్తంభించాయి. అనంతరం 2019లో 370 ఆర్టికల్‌ను కేంద్రం రద్దు చేసి, జమ్మూకాశ్మీర్‌లను విభజించింది. లడఖ్‌ను సైతం కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించింది. అయితే 2019 సాధారణ ఎన్నికలతో కలిపే జమ్మూ కశ్మీర్‌లో ఎన్నికలు నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.

Also Read:మామయ్య చనిపోతే... మీ నిర్ణయం గొప్పది: ఒమర్ అబ్ధుల్లాపై మోడీ ప్రశంసలు

కానీ అక్కడి స్థానిక పరిస్థితులు, భద్రతా పరమైన అంశాలను పరిగణనలోకి తీసుకున్న కేంద్రం ఆ నిర్ణయం నుంచి వెనకడుగు వేసింది. ప్రస్తుతం జమ్మూ కశ్మీర్‌ విషయంలో కేంద్రం మళ్లీ యాక్టివ్ అయ్యింది. రాష్ట్ర హోదాను కల్పించడం, ఎన్నికలను నిర్వహించడం అన్న రెండు  అంశాలపై ముందుకు సాగాలని, ఈ విషయంలో అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకోవాలని నిర్ణయించింది. 

click me!