‘సేవ్‌ ది సేవియర్‌’ .. ఈ నెల 18న వైద్యుల దేశవ్యాప్తంగా నిరసన

Siva Kodati |  
Published : Jun 12, 2021, 09:35 PM IST
‘సేవ్‌ ది సేవియర్‌’ .. ఈ నెల 18న వైద్యుల దేశవ్యాప్తంగా నిరసన

సారాంశం

ఈ నెల 18న దేశవ్యాప్తంగా నిరసనకు సిద్ధమయ్యారు వైద్యులు. బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, అసోం, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక సహా దేశంలోని పలు ప్రాంతాల్లో వైద్యులపై జరిగిన దాడులకు నిరసనగా ‘సేవ్‌ ది సేవియర్‌’ నినాదంతో ఆరోగ్య సిబ్బంది ఈ నెల 18న ఆందోళన చేపట్టనున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ( ఐఎంఏ) వెల్లడించింది

ఈ నెల 18న దేశవ్యాప్తంగా నిరసనకు సిద్ధమయ్యారు వైద్యులు. బీహార్‌, పశ్చిమ బెంగాల్‌, అసోం, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక సహా దేశంలోని పలు ప్రాంతాల్లో వైద్యులపై జరిగిన దాడులకు నిరసనగా ‘సేవ్‌ ది సేవియర్‌’ నినాదంతో ఆరోగ్య సిబ్బంది ఈ నెల 18న ఆందోళన చేపట్టనున్నట్టు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ( ఐఎంఏ) వెల్లడించింది. వైద్యులు, ఆరోగ్య సిబ్బంది నల్లటి వస్త్రాలు, మాస్కులు, బ్యాడ్జీలను ధరించి నిరసనలో పాల్గొనాలని ఐఎంఏ పిలుపునిచ్చింది. అయితే ఆ రోజు వైద్య సేవలకు ఆటంకం ఉండదని, అన్ని ఆసుపత్రులు యథావిధిగా పని చేస్తాయని తెలిపింది.

Also Read;కరోనాతో దేశంలో 515 మంది వైద్యులు మృతి: ఐఎంఏ

వైద్యులు , ఆరోగ్య సిబ్బందిపై జరుగుతున్న దాడుల నియంత్రణకు కఠిన చట్టాలను రూపొందించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఐఎంఏ అధ్యక్షుడు జేఏ జయలాల్‌ డిమాండ్‌ చేశారు. ప్రాణదాతలకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని ఆయన స్పష్టం చేశారు. పలు రాష్ట్రాల్లో కొవిడ్‌ వార్డుల్లో విధులు నిర్వర్తిస్తున్న వైద్యులపై జరిగిన అమానుష దాడుల గురించి జయపాల్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. కరోనా సెకండ్ వేవ్‌లో వైరస్‌ సోకి దేశవ్యాప్తంగా 719 మంది డాక్టర్లు ప్రాణాలు కోల్పోయినట్టు ఐఎంఏ వెల్లడించింది.  అత్యధికంగా బిహార్‌లోనే ఎక్కువ మరణాలు చోటు చేసుకున్నట్లు పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

Modi speech at the African Parliament:భారత్–ఇథియోపియా సంబంధాల్లో కొత్త అధ్యాయం | Asianet News Telugu
Reliance Jio : అంబానీ మామ న్యూఇయర్ గిప్ట్ ...జియో యూజర్స్ కి రూ.35,100..!