ఇండియాలో కరోనా తగ్గుముఖం: వరుసగా ఆరు రోజులుగా లక్షకు దిగువన కోవిడ్ కేసులు

By narsimha lodeFirst Published Jun 13, 2021, 10:13 AM IST
Highlights

ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా ఆరు రోజులుగా ఇండియాలో కరోనా కేసులు లక్షకు దిగువన నమోదయ్యాయి. గత 24 గంటల్లో 80,834 కరోనా కేసులు రికార్డయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీ తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.
 


న్యూఢిల్లీ:ఇండియాలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. వరుసగా ఆరు రోజులుగా ఇండియాలో కరోనా కేసులు లక్షకు దిగువన నమోదయ్యాయి. గత 24 గంటల్లో 80,834 కరోనా కేసులు రికార్డయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ 2వ తేదీ తర్వాత ఇంత తక్కువ సంఖ్యలో కరోనా కేసులు నమోదు కావడం ఇదే ప్రథమం.

గత 24 గంటల్లో కరోనాతో 3,303 మంది మరణించారు. దీంతో ఇప్పటివరకు ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 3,70,384 మందికి చేరుకొంది.  దేశంలో కరోనా కేసుల సంఖ్య 2,94,39,989కి చేరుకొంది.  దేశంలో కరోనా కేసుల సంఖ్య కంటే  రికవరీ కేసుల సంఖ్య ఎక్కువగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖాధికారుల గణాంకాలు చెబుతున్నాయి. 

గత 24 గంటల్లో కరోనా నుండి 1,32,062 మంది కోవిడ్ నుండి కోలుకొన్నారు. దేశంలో కరోనా నుండి కోలుకొన్నవారి ంఖ్య 2,80,43,446కి చేరుకొంది. దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 10,26,159కి చేరుకొంది. యాక్టివ్ కేసులు 3.49శాతంగా ఉందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ ప్రకటించింది. 


 

click me!