
కేరళలో మంకీపాక్స్ కేసు కలకలం దేశ వ్యాప్తంగా కలకలం సృష్టించింది. UAE నుండి తిరిగి వచ్చిన ఒక కేరళవాసికి ఈ వ్యాధి ఉందని తేలడంతో దీనిని దేశంలో మొదటి కేసుగా గుర్తించారు. ఈ నేపథ్యంలో దీనిని నివారించేందుకు, ఈ వ్యాధి పాటించాల్సిన జాగ్రత్తలను వివరిస్తూ కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ శుక్రవారం మార్గదర్శకాలు విడుదల చేసింది.
లంచావతారులు.. హర్యానాలో 83 మంది ప్రభుత్వ అధికారులు అరెస్టు !
ఈ మార్గదర్శకాల ప్రకారం అంతర్జాతీయ ప్రయాణీకులందరూ చర్మ గాయాలు, జననేంద్రియ గాయాలతో పాటు అనారోగ్యంతో ఉన్న వ్యక్తులతో సన్నిహిత సంపర్కాన్ని నివారించాలి. ఎలుకలు (ఉడుతలు వంటి జీవులు కూడా), మానవతేర ప్రైమేట్స్ (కోతి జాతి జంతువులు) పాటు చిన్న క్షీరదాలు అలాగే చనిపోయిన లేదా బతికి ఉన్న అడవి జంతువులతో సంబంధాన్ని కూడా వారు వదులుకోవాల్సి ఉంటుంది.
విదేశీ ప్రయాణికులు బుష్ మీట్ నుంచి మాంసం సేకరించవద్దని, అలాగే తయారు చేయవద్దని సూచించింది. ఆఫ్రికా జాతి అడవి జంతువుల నుంచి సేకరించిన ఉత్పత్తుల ద్వారా తయారు చేసిన క్రీములు, లోషన్లు, పౌడర్లు వంటి వాటిని ఉపయోగించకూదని తెలిపింది. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తులు ఉపయోగించే దుస్తులు, పరుపులు లేదా ఆరోగ్య సంరక్షణ కోసం ఉపయోగించే పదార్థాలు, అలాగే వ్యాధి సోకిన జంతువులతో సంబంధం ఉన్న వస్తువులను వాడటం మానుకోవాలని చెప్పింది. జ్వరం, దద్దుర్లు వంటి మంకీపాక్స్ లక్షణాలు కనిపించినట్లయితే, ముఖ్యంగా ఈ వ్యాధి గుర్తించిన ప్రదేశంలో ఉన్నట్లయితే లేదా వ్యాధి సోకిన వ్యక్తిని కలిసి ఉంటే వెంటనే సమీపంలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని కోరింది.
కేరళకు చెందిన అనుమానిత వ్యక్తి నుంచి శాంపుల్స్ సేకరించి పూణేలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించడంతో మొదటి మంకీపాక్స్ వ్యాధి నిర్ధారణ అయ్యిందని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఇది వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రజారోగ్య చర్యలను ఏర్పాటు చేయడంతో పాటు రాష్ట్ర ఆరోగ్య అధికారులతో సహకరించడానికి కేంద్రం ఒక ఉన్నత స్థాయి మల్టీ-డిసిప్లినరీ బృందాన్ని పంపింది. కేరళలోని కొల్లం జిల్లాకు చెందిన వ్యక్తి జూలై 12న యూఏఈ నుంచి విమానాశ్రయానికి వచ్చారని, ఆయన సన్నిహితులందరినీ గుర్తించామని సీఎం పినరయి విజయన్ ఒక ప్రకటనలో తెలిపారు.
Parliament Rules: "నో ధర్నా" పార్లమెంట్ లో మరో వివాదాస్పద ఉత్వర్తులు.. విపక్షాల మండిపాటు
ఇదిలా ఉండగా.. జూన్ 2 నాటికి, ప్రపంచంలోని 27 దేశాలలో 780 మంకీ పాక్స్ వేరియంట్ కేసులు నమోదయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. ఈ వైరస్ ఎండిమిక్ దశలో లేని ప్రాంతాల్లో వ్యాప్తి చెందడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఇన్ఫెక్షన్ వేగంగా పెరుగుతోంది. మే 29 నాటికి 257 కేసులు నమోదు కాగా, జూన్ 2 నాటికి.. ఆ సంఖ్య 780కి పెరిగింది. ఇప్పటి వరకు ఎలాంటి మరణాలు సంభవించకపోవడం కాస్త ఊరట నిచ్చే అంశం. అయినప్పటికీ అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ సూచనలు పాటించాలని చెబుతున్నారు.