వివాహ వేడుకలో భార్యతో కలిసి డ్యాన్స్ చేశారని తముళ్లను హతమార్చిన అన్న.. బావమరిదిపై కూడా దాడి..ఎక్కడంటే ?

Published : May 16, 2023, 10:15 AM IST
వివాహ వేడుకలో భార్యతో కలిసి డ్యాన్స్ చేశారని తముళ్లను హతమార్చిన అన్న.. బావమరిదిపై కూడా దాడి..ఎక్కడంటే ?

సారాంశం

వివాహ వేడుకలో భార్యతో కలిసి డ్యాన్స్ చేశారని ఓ వ్యక్తి తన తముళ్లను దారుణంగా హతమార్చాడు. అడ్డువచ్చిన బావ మరిది, మరో సోదరుడిపై కూడా దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌  లో వెలుగులోకి వచ్చింది. 

ఓ వివాహ వేడుకలో తన భార్యతో కలిసి డ్యాన్స్ చేశారనే కారణంతో ఇద్దరు తముళ్లను దారుణంగా హతమార్చాడు ఓ అన్న. తన బావ మరిది, అలాగే తన అన్నపై కూడా నిందితుడు దాడికి  పాల్పడ్డాడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ లోని కబీర్ ధామ్ జిల్లాలో చోటు చేసుకుంది. ఇది జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది.

కర్ణాటకలో బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కబీర్ ధామ్ జిల్లాలోని బంగౌరా గ్రామానికి చెందిన తిన్హా బేగా కు కొన్ని సంవత్సరాల కిందట వివాహం జరిగింది. అయితే ఇటీవల జరిగిన ఓ వివాహ వేడుకలో భార్య తన తముళ్లు, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి డ్యాన్స్ చేసింది. దీనిని బేగా గమనించాడు. దీంతో కోపంతో తన తముళ్లపై దాడి చేసి హతమార్చాడు. అనంతరం బావమరిది, అన్నయ్యపై కూడా దాడి చేశాడు. దీంతో వారికి కూడా గాయాలు అయ్యాయి. 

నా సింప్లిసిటీ చూసి ప్రధానికి అత్తనంటే ఎవరు నమ్మలేదు - సుధామూర్తి

క్షతగాత్రులిద్దరినీ చికిత్స నిమిత్తం సమీపంలోని హస్పిటల్ కు తరలించారు. వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. అయితే నిందితుడు పదునైన ఆయుధంతో భార్యపై కూడా దాడి చేసినట్టు ‘ఇండియా టుడే’ నివేదించింది. ఈ ఘటనపై సమాచారం అందగానే పోలీసులు అక్కడికి చేరుకొని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక అధికారులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను బంధువులకు అప్పగిస్తామని ఎస్పీ డాక్టర్ లాలూమండ్ సింగ్ తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు ప్రారంభించారు. 

PREV
click me!

Recommended Stories

Special Trains for Sankranti Festival: సంక్రాంతి సందర్భంగా ప్రత్యేక రైళ్లు| Asianet News Telugu
Real estate: నెల రోజుల్లో రూ. 20 ల‌క్ష‌ల లాభం.. అక్క‌డ రియ‌ల్ ఎస్టేట్ అంతలా ఎందుకు పెరుగుతోంది.?