పేలిన బాయిలర్.. 100 మందికి గాయాలు

Published : Mar 16, 2024, 09:44 PM ISTUpdated : Mar 16, 2024, 10:05 PM IST
 పేలిన బాయిలర్.. 100 మందికి గాయాలు

సారాంశం

హరియాణాలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. రేవారీలో ఉన్న ఓ ఫ్యాక్టరీలోని బాయిలర్ పేలింది. ఈ ఘటనలో పలువురికి గాయాలు అయ్యాయి. అధికారులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపడుతున్నారు.

బాయిలర్ పేలి పలువురు కార్మికులకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన హరియాణాలోని రేవారీలో చోటు చేసుకుంది. శనివారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. సివిల్ సర్జన్ డాక్టర్ సురేందర్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని ధారుహెరా ప్రాంతంలో ఈ ఘటన జరిగిందని ‘హిందుస్థాన్ టైమ్స్’ పేర్కొంది.

ఈ ప్రమాదంపై సమాచారం అందగానే హాస్పిటల్స్ ను అలెర్ట్ చేశామని, ఫ్యాక్టరీకి అంబులెన్స్ పంపించామని సురేందర్ యాదవ్ అన్నారు.  ఇప్పటి వరకు 100 మందికి గాయాలైనట్లుగా  జాతీయ  మీడియాలో వార్తలు వస్తున్నాయి. 

 

 

‘లైఫ్ లాంగ్ ఫ్యాక్టరీలో రాత్రి 7 గంటల ప్రాంతంలో పేలుడు సంభవించింది. ట్రామా సెంటర్లోని వైద్యులను అప్రమత్తం చేశాం. పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అవసరమైన ఏర్పాట్లు చేశాం’ అని రోమ్ తక్ లోని పీజీఐఎంఎస్ డైరెక్టర్ డాక్టర్ ఎస్ఎస్ లోహ్చాబ్ తెలిపారు. 

కాగా.. ఈ ఘటనా స్థలానికి అగ్నిమాపక యంత్రాలు, అంబులెన్సుల చేరుకున్నాయి. పోలీసులు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్లు ప్రమాద స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలు చేపడుతున్నారు.

PREV
click me!

Recommended Stories

Why Did Protests Erupt in India Over Iran’s Supreme Leader Ali Khamenei? | Asianet News Telugu
Congress: రూ. 7 కోట్లు ఇస్తే ఎమ్మెల్యే టికెట్.. కాంగ్రెస్ పార్టీపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు.