
Richest MLA: దేశంలోని అత్యంత సంపన్న ప్రజాప్రతినిధుల(ఎమ్మెల్యేలు) జాబితాను ఏడీఆర్ (Association for Democratic Reforms) నివేదికను విడుదల చేసింది. ఈ జాబితాలో కర్ణాటక డిప్యూటీ సీఎం, కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు డీకే శివకుమార్ అగ్రస్థానంలో నిలిచారు. అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (Adr), నేషనల్ ఎలక్షన్ వాచ్ నివేదిక ప్రకారం.. DK శివకుమార్ రూ. 1,413 కోట్ల ఆస్తులతో దేశంలో అత్యంత సంపన్న ఎమ్మెల్యేగా నిలిచారు.
ఆ తర్వాత వరుస రెండు స్థానాల్లోనూ కర్ణాటకకు చెందిన నేతలే నిలిచారు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. దేశంలోని అత్యంత సంపన్న శాసనసభ్యుల జాబితాలో టాప్ 20లో 12 మంది ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం. దేశంలోనే అత్యధికంగా కర్ణాటక ఎమ్మెల్యేల్లో 14% మంది బిలియనీర్లు (రూ. 100 కోట్లు) ఉన్నారని ఏడీఆర్ నివేదిక పేర్కొంది. రాష్ట్రంలోని(కర్ణాటక) ఎమ్మెల్యేల సగటు ఆస్తులు రూ.64.3 కోట్లుగా నమోదయ్యాయి.
టాప్ 3 ధనిక ఎమ్మెల్యేలు కర్ణాటకలోనే
టాప్ 3 జాబితా గురించి మాట్లాడుతూ.. ముగ్గురు ఎమ్మెల్యేలు కర్ణాటకకు చెందినవారే. డికె తర్వాత రెండవ స్థానంలో స్వతంత్ర ఎమ్మెల్యే , వ్యాపారవేత్త కెహెచ్ పుట్టస్వామి గౌడ ఉన్నారు. ఆయన ఆస్తులు రూ.1,267 కోట్లు కాగా.. రూ.5 కోట్ల అప్పులు ఉన్నాయి. మూడో అత్యంత సంపన్నుడు ప్రియాకృష్ణ. కర్ణాటక అసెంబ్లీలో అత్యంత పిన్న వయస్కుడైన కాంగ్రెస్ ఎమ్మెల్యే. 39 ఏళ్ల ఎమ్మెల్యే ఆస్తుల విలువ రూ.1,156 కోట్లు. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ నివేదికలో 28 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 4,001 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను విశ్లేషించారు.
2023ి ఎన్నికల కమిషన్ ముందు దాఖలు చేసిన అఫిడవిట్‌లో.. శివకుమార్ తన వద్ద మొత్తం రూ. 273 కోట్ల స్థిరాస్తులు , రూ. 1,140 కోట్ల విలువైన చరాస్తులు ఉన్నాయని చూపించారు. అందులో రూ.265 కోట్ల అప్పులు ఉన్నట్టు చూపించారు. గౌడకు రూ.990 కోట్ల స్థిర ఆస్తులు, రూ.276 కోట్ల చరాస్తులు ఉన్నాయని తెలిపారు. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ జాబితాలో అత్యధిక అప్పులు చేసిన వ్యక్తిగా కూడా ప్రియాకృష్ణ రికార్డు సృష్టించారు.
ఆయనకు రూ.881 కోట్ల అప్పులున్నాయి. అతని తండ్రి ఎం కృష్ణప్ప కర్ణాటకలోని టాప్ బిలియనీర్ల జాబితాలో 18వ స్థానంలో ఉన్నారు. మరోవైపు.. భారతదేశంలో అత్యంత పేద ఎమ్మెల్యే గా పశ్చిమ బెంగాల్‌లోని సింధు నియోజకవర్గానికి చెందిన నిర్మల్ కుమార్ ధార. వారి అతని ఆస్తులు రూ. 1,700, అప్పులు లేవు
ధనవంతుల జాబితాలో ఉన్న కర్ణాటక ఎమ్మెల్యేలలో గనుల వ్యాపారి గాలి జనార్దన రెడ్డి 23వ స్థానంలో ఉన్నారు. ఆయన ఆస్తులు చాలా వరకు ఆయన భార్య అరుణ లక్ష్మి పేరు మీద ఉన్నట్లు ప్రకటించారు. ఆయన తన కొత్త పార్టీ కళ్యాణ రాజ్య ప్రగతి పక్ష (KRPP)తో కలిసి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా పోటీ చేశారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటక దేశంలోనే అత్యధికంగా బిలియనీర్లను ఎన్నుకోగా, వారిలో 32 మంది రూ.100 కోట్లకు పైగా ఆస్తులు కలిగి ఉన్నారు. కాంగ్రెస్ నుండి 19 మందితో పాటు, ఇతర బిలియనీర్లు బిజెపి నుండి తొమ్మిది మంది, జెడి (ఎస్ నుండి ఇద్దరు), కెఆర్‌పిపి నుండి ఒకరు , ఒక స్వతంత్రుడు ఉన్నారు.