గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణే లక్ష్యం.. 9 నుంచి 14 ఏళ్ల లోపు బాలికలకు వ్యాక్సిన్లు వేయనున్న కేంద్రం

By team teluguFirst Published Dec 23, 2022, 12:17 PM IST
Highlights

9 -14 ఏళ్ల లోపు బాలికలకు కేంద్ర ప్రభుత్వం మరో వ్యాక్సిన్ ను అందించాలని చూస్తోంది. మహిళల్లో వచ్చే గర్భాశయ ముఖద్వారా క్యాన్సర్ ను అందించేందుకు ఈ వ్యాక్సిన్ ను ఇవ్వనున్నారు. ఈ వ్యాక్సిన్ ను దేశీయంగా రూపొందించారు. 

మహిళల్లో గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారించేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా 9 నుండి 14 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికలకు పాఠశాల్లోనే హెచ్ పీవీ వ్యాక్సిన్లు అందించనుంది. దీని కోసం ప్రతీ జిల్లాలో 5 -10 తరగతి చదివే బాలిక సంఖ్యను సేకరించాలని కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కోరింది.

గర్భాశయ క్యాన్సర్ ను నివారించడానికి దేశీయంగా అభివృద్ధి చేసిన హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్ పీవీ ) వ్యాక్సిన్ ను వచ్చే ఏడాది నుంచి అందించాలని కేంద్రం భావిస్తోంది. యూనివర్సల్ ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ (యుఐపీ) లో హెచ్ పీవీ వ్యాక్సిన్ ప్రవేశపెట్టాలని నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఫర్ ఇమ్యునైజేషన్ (ఎన్టీఏజీఐ) సిఫార్సు చేసింది.

ఆరు రోజుల ముందే వాయిదా :లోక్‌సభ నిరవధిక వాయిదా

ప్రపంచవ్యాప్తంగా మహిళల్లో సర్వికల్ క్యాన్సర్ నాలుగో అత్యంత సాధారణ క్యాన్సర్ అని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్, కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ విడుదల చేసిన ఒక సంయుక్త లేఖలో పేర్కొన్నారు. భారతదేశంలో గర్భాశయ క్యాన్సర్ మహిళల్లో రెండో అత్యంత సాధారణ క్యాన్సర్ అని తెలిపారు. 

అయితే ఈ టీకాను పాఠశాలల ద్వారా అందించనున్నారు. ఒక వేళ టీకాలు వేసే రోజు పాఠశాలకు హాజరుకాలేని బాలికలకు సమీపంలోని ఆరోగ్య కేంద్రంలో అందజేస్తామని విద్యాశాఖ ఒక ప్రకటనలో తెలిపింది. పాఠశాలకు దూరంగా ఉండే బాలికలు కమ్యూనిటీ అవుట్ రీచ్, మొబైల్ టీమ్ ల ద్వారా అందజేస్తారు. వ్యాక్సినేషన్ నంబర్ల నమోదు, రికార్డింగ్, రిపోర్టింగ్ కోసం యూ-విన్ యాప్ ను ఉపయోగించనున్నారు.గర్భాశయ క్యాన్సర్ నివారణ,  బాలికలలో హెచ్ పీవీ వ్యాక్సిన్ ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం ఆదేశించింది.

దేశంలో 3వేలకు పైగా కరోనా యాక్టివ్ కేసులు.. వైరస్ వ్యాప్తిపై కేంద్రం వరుస సమావేశాలు

గర్భాశయ క్యాన్సర్ ను ముందుగానే గుర్తించి సమర్థవంతంగా నివారించవచ్చు. నయం కూడా చేయవచ్చు. చాలా గర్భాశయ క్యాన్సర్లు హ్యూమన్ పాపిల్లోమా వైరస్ (హెచ్ పీవీ) తో సంబంధం కలిగి ఉంటాయి. బాలికలు, మహిళలు వైరస్ బారిన పడకముందే ఈ వ్యాక్సిన్ ఇస్తే ఈ క్యాన్సర్ నుంచి రక్షణ పొందవచ్చు.

ఈ వ్యాక్సిన్ అందించేందుకు పాఠశాలల్లో హెచ్ పీవీ టీకా కేంద్రాలను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం లేఖలో రాష్ట్రాలను కోరింది. జిల్లా ఇమ్యునైజేషన్ అధికారికి సపోర్ట్ అందించాలని, అలాగే జిల్లా మేజిస్ట్రేట్ ఆధ్వర్యంలోని జిల్లా టాస్క్ ఫోర్స్ ఆన్ ఇమ్యునైజేషన్ (డిటిఎఫ్ఐ) ప్రయత్నాలలో భాగం కావాలని, జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాల నిర్వహణ బోర్డుతో సమన్వయం చేసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారిని అదేశించాలని తెలిపింది.

మరో రెండు కులాలకు ఎస్టీ హోదా.. బిల్లును ఆమోదించిన రాజ్యసభ..

వ్యాక్సినేషన్ కార్యకలాపాలను సమన్వయం చేయడానికి ప్రతి పాఠశాలలో ఒక నోడల్ వ్యక్తిని ఏర్పాటు చేయాలని, పాఠశాలలో 9-14 సంవత్సరాల బాలికల సంఖ్యను క్రోడీకరించాలని, వాటిని యు-విన్ లో అప్ లోడ్ చేయాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది. స్పెషల్ పేరెంట్స్-టీచర్స్ మీటింగ్స్ (పీటీఏ) సమయంలో ఈ వ్యాక్సిన్ పై తల్లిదండ్రులకు టీచర్లు అవగాహన కల్పించాలని చెప్పింది. 
 

click me!