ఎవరికో మెసేజ్ చేసిందని.. తల్లిని దారుణంగా హతమార్చిన 17 ఏళ్ల కుమారుడు..

Published : Aug 22, 2023, 11:45 AM IST
ఎవరికో మెసేజ్ చేసిందని..  తల్లిని దారుణంగా హతమార్చిన 17 ఏళ్ల కుమారుడు..

సారాంశం

17 ఏళ్ల బాలుడు తన తల్లిపై అనుమానం పెంచుకున్నాడు. ఆమె ఎవరితోనే సన్నిహితంగా ఉంటోందని భావించాడు. ఈ క్రమంలో గత ఆదివారం తల్లి ఎవరికో మెసేజ్ చేయడం చూసి, ఆమెను దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.

మహారాష్ట్రలో దారుణం జరిగింది. తన తల్లి ఎవరికి మెసేజ్ చేసిందని 17 ఏళ్ల కుమారుడు ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆమెపై కోపాన్ని ప్రదర్శించాడు. క్షణికావేశంలో తల్లిని ఘోరంగా హతమార్చాడు. ఈ ఘటన పాల్ఘర్ జిల్లాలోని కలకలం రేకెత్తించింది. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.

పాకిస్థాన్ పై మరో సారి భారత్ సర్జికల్ స్ట్రైక్.. 7-8 మంది ఉగ్రవాదులు హతం

పాల్ఘర్ జిల్లా వాసాయి టౌన్ షిప్ లోని పెరోల్ ప్రాంతంలో 35 ఏళ్ల సోనాలి గోగ్రా అనే మహిళ తన 17 ఏళ్ల కుమారుడి, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి నివసిస్తోంది. అయితే కొంత కాలం నుంచి కుమారుడు తన తల్లిపై అనుమానం పెంచుకున్నాడు. ఎవరితోనే సన్నిహిత్యంగా ఉంటోందని అనుమానిస్తున్నాడు. ఈ విషయంలో తరచూ వారి మధ్య గొడవలు జరుగుతుండేవి.

Telangana Assembly Elections 2023: ఆశ్చర్యంలో ముంచెత్తిన కేసీఆర్, ఎన్టీఆర్ తర్వాత..

ఈ క్రమంలో గత ఆదివారం రాత్రి ఇంట్లో బాలుడు భోజనం చేస్తున్నాడు. ఆ సమయంలో తల్లి తన మొబైల్ లో ఎవరికో మెసేజ్ చేస్తోంది. దీనిని గమనించిన కుమారుడికి కోపం వచ్చింది. ఆమెపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇంట్లో ఉన్న గొడ్డలి తీసి తల్లిపై దాడి చేశాడు. ఈ గొడవ జరిగిన సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. కొంత సమయం తరువాత వారంతా ఇంటికి వచ్చారు. 

తీవ్రగాయాలతో బాధపడుతున్న సోనాలి గోగ్రాను చూసి షాక్ అయ్యారు. వెంటనే ఆమెను భివాండీలోని ఇందిరాగాంధీ మెమోరియల్ హాస్పిటల్ కు తరలించారు. కానీ అప్పటికే ఆమె మరణించిందని వైద్యులు నిర్దారించారు. దీనిపై సమాచారం అందగానే మాండ్వి పోలీసులు అక్కడికి చేరుకున్నారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపించారు.

Telangana Assembly Elections 2023: పట్నం మహేందర్ రెడ్డికి మంత్రి పదవి?

ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అశోక్ కాంబ్లే ‘ఎన్డీటీవీ’తో తెలిపారు. నిందితుడిపై ఐపీసీ సెక్షన్ 302 (హత్య) కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. నిందితుడు ఇంకా దొరకలేదని తెలిపారు. బాలుడి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నామని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

Nitin Nabin : బీజేపీ నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా మోదీ నమ్మిన బంటు.. ఎవరీ నితిన్ నబిన్?
Indian Railways : ఇండియన్ రైల్వే బంపర్ ఆఫర్.. తక్కువ ఖర్చుతో దేశమంతా తిరిగేయండిలా !