తల్లిని అవమానించారన్న కోపం.. భార్య, బావమరిది, వదినని కాల్చి చంపిన వ్యక్తి...

Published : Aug 22, 2023, 10:46 AM IST
తల్లిని అవమానించారన్న కోపం.. భార్య, బావమరిది, వదినని కాల్చి చంపిన వ్యక్తి...

సారాంశం

ఇద్దరు పిల్లల తండ్రి అయి ఉండి.. అత్తాకోడళ్ల గొడవలో కోపానికి పోయి భార్యను, ఆమె అక్కాతమ్ముడిని అతి దారుణంగా కాల్చి చంపాడో వ్యక్తి. 

భోపాల్ : తల్లిని అవమానించారన్న కోపంతో భార్య, బావమరిది, మరదలిని నడిరోడ్డులో అందరూ చూస్తుండగా తుపాకీతో కాల్చి చంపాడో వ్యక్తి. వారు ముగ్గురూ తనను అవమానించారని తల్లి కొడుకుకు ఫిర్యాదు చేసింది. దీంతో ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. 

ఓ వ్యక్తి తన భార్య, ఆమె సోదరుడు, సోదరిలను ఆదివారం ఎంపీ మొరెనా నగరంలోని రద్దీగా ఉండే బస్టాండ్‌లో కాల్చి చంపాడు. నిందితుడు త్రిలోకీ పర్మార్‌ గా గుర్తించారు. అతనికి రాఖీ అనే మహిళతో 12 ఏళ్ల క్రితం పెళ్లయ్యింది. వారికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 

ఈ దారుణమైన ట్రిపుల్ మర్డర్ ఒక్కసారిగా సమాజం ఉలిక్కి పడేలా చేసింది. రాఖీ ఆమె అత్తగారి మధ్య చాలా కాలంగా వివాదం నెలకొందని తెలుస్తోంది. ఈ గొడవల కారణంగానే ఈ జంట వివాహం బంధంలో పొరపొచ్చాలు వచ్చాని పోలీసులు చెబుతున్నారు. అత్తాకోడళ్ల గొడవల కారణంగా ఇంట్లో ఎప్పుడూ ఉద్రిక్తత ఉంటుండేది. 

చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ కీలకం:చంద్రయాన్-3 పై ఇస్రో

ఇది రోజురోజుకూ పెరిగిపోతుండడంతో రాఖీ సోదరుడు యువరాజ్, అక్క జూలీ జోక్యం చేసుకోవాలని భావించారు. వారికి సర్దిచెప్పాలనుకున్నారు. ఇందులో భాగంగానే.. ఆదివారం, యువరాజ్, జూలీ రాఖీ అత్తగారితో మాట్లాడటానికి మొరెనాలోని బాగ్చిని ప్రాంతంలోని త్రిలోకి ఇంటికి వచ్చారు. వారు మాట్లాడుతున్న సమయంలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఆ సమయంలో త్రిలోకి ఇంట్లో లేడు. బజారుకు వెళ్లాడు. 

అతని తల్లి అతనికి ఫోన్ చేసి తనను కోడలు, ఆమె సోదరుడు, సోదరి ముగ్గురూ అవమానించారని చెప్పింది. దీంతో పట్టరాని కోపంతో త్రిలోకి ఇంటికి తిరిగొచ్చాడు. అతను వచ్చేసరికే ముగ్గురూ ఇంట్లోనుంచి వెళ్ళిపోయారు. అది గుర్తించి, వారిని వెతుక్కుంటూ వెళ్ళాడు. రాఖీ, యువరాజ్, జూలీ బాగ్చిలు బస్టాండ్‌లో బస్సు కోసం చూస్తుండడం గమనించాడు. 

వెంటనే త్రిలోకి  ఒక్క మాట కూడా మాట్లాడకుండా పిస్టల్ తీసి వారిమీద కాల్పులు జరపడం ప్రారంభించాడని పోలీసులు తెలిపారు. ఈ అనుకోని పరిణామానికి భయంతో ఇతర ప్రయాణికులు చెల్లాచెదురైపోయారు. అతను వారిమీద ఐదురౌండ్ల కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో యువరాజ్, రాఖీ అక్కడికక్కడే మరణించారు. జూలీ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది.

త్రిలోకి తన తల్లిని, ఇద్దరు పిల్లలను వదిలేసి పారిపోయాడు. ఎస్పీ శైలేంద్ర సింగ్ చౌహాన్ నేతృత్వంలో ఒక బృందం సంఘటనా స్థలానికి చేరుకుంది, అదనపు బలగాలను మోహరించి, త్రిలోకి కోసం వెతకడానికి బృందాలను పంపారు. కొన్ని గంటల తర్వాత అతన్ని పట్టుకున్నారు.

పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించారు. త్రిలోకి భింద్ జిల్లాకు చెందిన వ్యక్తి, అక్కడ ఎక్కువగా తుపాకీ సంస్కృతి ఉంటుంది. అతని వద్ద కంట్రీమేడ్ పిస్టల్ ఉందని ఎస్పీ తెలిపారు

PREV
click me!

Recommended Stories

Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?
IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు