మోదీకి పాదాభివందనం చేసి.. పద్మశ్రీ అందుకున్న 125 ఏళ్ల యోగా గురువు Swami Sivananda.. ఆయన గురించిన విశేషాలు ఇవే

Published : Mar 22, 2022, 04:23 PM IST
మోదీకి పాదాభివందనం చేసి..  పద్మశ్రీ అందుకున్న 125 ఏళ్ల యోగా గురువు Swami Sivananda.. ఆయన గురించిన విశేషాలు ఇవే

సారాంశం

పద్మ పురస్కారాల ప్రధానోత్సం సందర్భంగా చోటుచేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. పద్మ పురస్కారం తీసుకోవడానికి వచ్చిన 125 ఏళ్ల యోగ గురువు స్వామి శివానంద (Swami Sivananda).. ప్రధాని మోదీ ముందు పాదాభివందనం చేశారు. 

దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో సోమవారం పద్మ పురస్కారాల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. అవార్డు గ్రహీతలకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పద్మ పురస్కారాలను ప్రధానం చేశారు. పద్మ పురస్కారాల ప్రధానోత్సం సందర్భంగా చోటుచేసుకున్న ఓ సంఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. పద్మ పురస్కారం తీసుకోవడానికి వచ్చిన 125 ఏళ్ల యోగ గురువు స్వామి శివానంద (Swami Sivananda).. ప్రధాని మోదీ ముందు పాదాభివందనం చేశారు. దీంతో ప్రధాని మోదీ కూడా కిందకు వంగి ప్రతి నమస్కారం చేశారు. అలాగే రాష్ట్రపతి కోవింద్ దగ్గరికి వెళ్లిన సమయంలో కూడా స్వామి శివానంద.. పాదాభివందనం చేశారు. అయితే రాష్ట్రపతి ఆయన వద్దకు వెళ్లి వద్దని వారించారు. ఆయనను పైకి లేపి Padma Shri పురస్కారాన్ని అందజేశారు. 

ఈ చర్యతో ఆ కార్యక్రమానికి హాజరైన వారు కరతాళ ధ్వనులు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ వీడియో హృదయాన్ని హత్తుకునేలా ఉందని పేర్కొన్నారు. పలువురు ప్రముఖులు కూడా ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.  ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతుంది. 

ఇక, పద్మశ్రీ అవార్డును స్వీకరించడానికి స్వామి శివానంద.. తెల్లటి ధోవతి, కుర్తా ధరించి.. చాలా సింపుల్‌గా వచ్చారు. కాళ్లకు చెప్పులు కూడా లేకుండా అత్యంత సామాన్యంగా అవార్డుల ప్రధానోత్సవంలో పాల్గొన్నారు. 

 

స్వామి శివానంద గురించి.. 
స్వామి శివానంద 1896 ఆగస్టు 8న సిల్హెట్ జిల్లాలో (అప్పుడు అవిభక్త భారతదేశంలో ఉన్న ఈ ప్రాంతం.. ప్రస్తుతం బంగ్లాదేశ్‌లో ఉంది) జన్మించాడు. శివానంద కుటుంబం అత్యంత పేదరికంలో ఉండేది. దీంతో అతని తల్లిదండ్రులు బతుకుదెరువు కోసం భిక్షను ఆశ్రయించారు. అయితే ఆరేళ్ల వయసులోనే శివానంద తల్లిదండ్రులను కోల్పోయి అనాథ అయ్యారు. తర్వాత శివానందకు పశ్చిమ బెంగాల్‌ నబద్వీప్‌లోని గురూజీ ఆశ్రమంలో గురు ఓంకారానంద గోస్వామి ఆశ్రయం కల్పించారు. అక్కడే శివానందకు యోగా సహా ఆధ్యాత్మిక విద్యను బోధించారు.

ఈ క్రమంలోనే శివానంద.. సానుకూల ఆలోచనలను అలవాటు చేసుకన్నారు. క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని ఎంచుకున్నారు. ఆయన జీవితాన్నే క్రమశిక్షణతో కూడినదిగా మార్చుకున్నారు. తన జీవితాన్ని సమాజసేవకు అంకితం చేశారు. తెల్లవారుజామున 3 గంటలకు నిద్రలేచి.. దేవునికి పూజ చేయడం శివానందకు అలవాటుగా మరింది. దైవ నామస్మరణ చేస్తూ వాకింగ్ చేస్తుంటాడు. ఇది కేవలం శారీరక వ్యాయామమే కాకుండా ఆధ్యాత్మిక వ్యాయామం కూడా చేస్తుందని ఆయన చెబుతారు. తర్వాత శివానంద ఒక గంట పాటు యోగా మరియు ప్రాణాయామం చేస్తారు.

దేశంలోని వివిధ ప్రాంతాలలో నిరుపేదలకు సేవ చేసేందుకు తన జీవితాన్ని అంకితం చేశారు. ఐదు దశాబ్దాలకు పైగా పూరీలో 400 నుంచి 600 మంది కుష్టువ్యాధి బాధిత కుష్టువ్యాధి పీడిత యాచకుల్నిఆదుకున్నారు. కుష్టు వ్యాధిగ్రస్తులను సజీవ దేవతలుగా పేర్కొంటూ.. వారికి అవసరమైన దుప్పట్లు, పాత్రలు, దోమతెరలు, బట్టలు మరియు ఆహారాన్ని కూడా అందిస్తున్నారు.

స్వామి శివానంద మానవాళికి నిస్వార్థంగా సేవ చేస్తుంటారు. స్వామి శివానంద ఈ ప్రపంచాన్ని తన ఇల్లు అని, ప్రజలు తల్లిదండ్రులు అని నమ్ముతారు. వారిని ప్రేమించడం, వారికి సేవ చేయడం తన ధర్మం అని చెబుతుంటారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu