జ్ఞాపకశక్తి తో ఔరా అనిపిస్తున్న రెండేళ్ల చిన్నారి..!

Published : Mar 22, 2022, 03:42 PM IST
జ్ఞాపకశక్తి తో ఔరా అనిపిస్తున్న  రెండేళ్ల చిన్నారి..!

సారాంశం

చిన్నారి ఆద్విక్‌కు అప్పటి నుంచే నేతలు, వివిధ దేశాల చిహ్నాలు, జాతీయ పతకాలు, మ్యాప్‌లు జంతువులు, పక్షులు తదితరాల గురించి తల్లిదండ్రులు తెలియజేసేవారు.

రెండేళ్ల వయసుకు దాదాపు చాలా మంది పిల్లలకు కనీసం మాటలు కూడా రావు.  కానీ ఓ చిన్నారి మాత్రం ఔరా అనిపిస్తున్నాడు. తన  జ్ఞాపకశక్తి తో రికార్డులు సృష్టిస్తున్నాడు. తతమిళనాడు రాష్ట్రం విరుదునగర్‌ జిల్లా శివకాశికి చెందిన రామకృష్ణన్‌-సత్య దంపతుల రెండవ కుమారుడు ఆద్విక్‌కుమార్‌ (2). 

చిన్నారి ఏడాది వయస్సులోనే ఇంట్లో జరుగుతున్న విషయాలు గమనించి కొద్దికాలం అనంతరం మళ్లీ వాటిని తెలియజేసేలా జ్ఞాపకశక్తి కలిగి ఉన్నాడని తల్లిదండ్రులు గుర్తించారు. చిన్నారి ఆద్విక్‌కు అప్పటి నుంచే నేతలు, వివిధ దేశాల చిహ్నాలు, జాతీయ పతకాలు, మ్యాప్‌లు జంతువులు, పక్షులు తదితరాల గురించి తల్లిదండ్రులు తెలియజేసేవారు.

ఏ క్షణంలోనైనా ఏ వస్తువు, చిత్రం చూపించినా చిన్నారి టక్కున సమాధానం చెప్పేవాడు. ఆ రీతితో ఒకట్నిర నుంచి ఆరు నెలల కాలంలో ఆద్విక్‌ సుమారు 20కి పైగా రికార్డులు సృష్టించాడు. గత నెలలో నిర్వహించిన కార్యక్రమంలో 3 నిముషాల 32 సెకన్లలో 100 రకాల చిత్రాలు, ఐదుగురు రాజకీయనేతలు, ఆరుగురు జాతీయ నాయకులు, 25 వాహనాల లోగోలు, 10 మంచి అలవాట్లు, ఐదుగురు స్వాతంత్య్ర సమరయోధులు, 28 రకాల జంతువులు, 15 రకాల పక్షులు, 30 రకాల ఆహార పదార్ధాల పేర్లు చెప్పి జాకీ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకున్నాడు. 

PREV
click me!

Recommended Stories

Putin India Tour: భారత్ లో అడుగుపెట్టిన పుతిన్ సెక్యూరిటీ చూశారా? | Modi Putin | Asianet News Telugu
Putin Tour: భారత్‌కి పుతిన్‌ రాక.. వారణాసిలో దీపాలతో స్వాగతం | Vladimir Putin | Asianet News Telugu