నేను ప్రాణాలతో బయటపడ్డా.. పంజాబ్‌ సీఎంకు థ్యాంక్స్ చెప్పానని చెప్పండి: అధికారులతో మోడీ

By Siva KodatiFirst Published Jan 5, 2022, 4:29 PM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోడీకి (narendra modi) పంజాబ్‌లో (punjab) నిరసన సెగ ఎదురైన వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో భటిండా ఎయిర్‌పోర్ట్‌లో (bhatinda airport) పంజాబ్ ఉన్నతాధికారులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు

ప్రధాని నరేంద్ర మోడీకి (narendra modi) పంజాబ్‌లో (punjab) నిరసన సెగ ఎదురైన వ్యవహారం జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో భటిండా ఎయిర్‌పోర్ట్‌లో (bhatinda airport) పంజాబ్ ఉన్నతాధికారులతో ప్రధాని మోడీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం చరణ్‌జిత్ సింగ్ చన్నీకి కృతజ్ఞతలు చెప్పానని చెప్పండంటూ అధికారులకు తెలిపారు. తాను భటిండా ఎయిర్‌పోర్టుకు ప్రాణాలతో చేరుకోగలిగానని ప్రధాని అన్నారు. 

కాగా.. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ బుధవారం పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌లో ప‌ర్య‌టించాల్సి ఉంది. అయితే, తన షెడ్యూల్ చేసిన పర్యటనను ప్రధాన భద్రతా లోపం కారణంగా రద్దు చేసుకున్నారు.  హుస్సేనివాలాలోని జాతీయ అమరవీరుల స్మారకానికి 30 కిలోమీటర్ల దూరంలో, ప్రధానమంత్రి కాన్వాయ్ ఫ్లైఓవర్‌కు చేరుకున్నప్పుడు, కొంతమంది నిరసనకారులు రహదారిని అడ్డుకున్నట్లు కనుగొనబడింది. ప్రధాని 15-20 నిమిషాల పాటు ఫ్లై ఓవర్‌పై ఇరుక్కుపోయారు. ప్రధాని భద్రతలో ఇది అతిపెద్ద లోపం అని చెప్పాలి.  

భద్రతా లోపం కారణంగా ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనాల్సిన పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్ ర్యాలీ రద్దయినట్టు హోం మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ''ప్రధాని కాన్వాయ్ ఒక ఫ్లైఓవర్ దగ్గరకు చేరుకునేటప్పటికి కొందరు నిరసనకారులు రోడ్డును దిగ్బంధించినట్టు గుర్తించారు. ప్రధాని ఫ్లైఓవర్‌పైనే 15 నుంచి 20 నిమిషాలు చిక్కుకుపోయారు. ప్రధాని భద్రతకు సంబంధించిన ఇది కీలకమైన లోపం''అని హోం మంత్రిత్వ శాఖ త‌న ప్రకటనలో పేర్కొంది.

ALso Read:ప్ర‌ధాని కాన్వాయ్ ని అడ్డుకున్న నిర‌స‌న‌కారులు.. ప్లైఓవ‌ర్‌పై 15నిమిషాల పాటు ప్ర‌ధాని !

కాగా, దేశంలో ఏడాది ఐదు రాష్ట్రాల్లో త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు (5 state elections) జ‌ర‌గ‌నున్నాయి. అందులో పంజాబ్ కూడా ఒక‌టి.  ఈ నేప‌థ్యంలోనే ప్ర‌ధాని మోడీ  పంజాబ్‌లో పర్యటిస్తుండగా, రైతు చట్టాల రద్దు తర్వాత పర్యటించడం ఇదే మొదటిసారి. షెడ్యూల్ ప్రకారం ప్రధాని ఫిరోజ్‌పూర్‌లో జరిగే ర్యాలీలో పాల్గొనాల్సి ఉండగా, దీనికి ముందు సభా వేదికకు దారితీసే మూడు అప్రోచ్ రోడ్డులను కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ  (కేఎంసీసీ) దిగ్బంధించింది. 

Big Security breach in PM’s Convoy as u can see protesters running along side of PM’s car pic.twitter.com/HLd1c7drno

— Gagandeep Singh (@Gagan4344)

రైతుల డిమాండ్లపై జనవరి 15న చర్చిస్తారనే హామీ ఇవ్వడంతో రైతులు తమ ఆందోళ‌న విర‌మించిన‌ట్టు స‌మాచారం.  ఇదిలావుండ‌గా, ప్ర‌ధాని మోడీ కాన్వాయ్ ని అడ్డుకోవ‌డంపై బీజేపీ చీఫ్ జేపీ న‌డ్డా తీవ్ర స్థాయిలో ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ట్విట్ట‌ర్ వేదిక‌గా పంజాబ్ అధికార పార్టీ కాంగ్రెస్ పై విమ‌ర్శ‌ల‌తో విరుచుకుప‌డ్డారు. త్వ‌ర‌లో జ‌ర‌గ‌బోయే ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌నే భ‌యంతోనే పంజాబ్ కాంగ్రెస్.. ప్ర‌ధాని మోడీ ప‌ర్య‌ట‌న‌కు అన్ని విధాలుగా అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నాలు చేసింద‌ని జేపీ న‌డ్డా ఆరోపించారు.

click me!