coronavirus: కోటి మందికిపైగా టీనేజ‌ర్ల‌కు టీకాలు.. !

By Mahesh Rajamoni  |  First Published Jan 5, 2022, 4:22 PM IST

coronavirus: దేశంలో క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన త‌ర్వాత కోవిడ్-19 కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో వేగం పెంచాయి. టీనేజ‌ర్ల‌కు ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం కోటి మందికి పైగా క‌రోనా టీకాలు అందించారు. 
 


coronavirus: దేశంలో క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన త‌ర్వాత కోవిడ్-19 కేసులు క్ర‌మంగా పెరుగుతున్నాయి. భార‌త్ లోనూ గ‌త వారం రోజులుగా పాజిటివ్ కేసులు అధికంగా న‌మోద‌వుతున్నాయి. దీంతో అప్ర‌మ‌త్త‌మైన కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో వేగం పెంచాయి. దీనిలో భాగంగా దేశంలో  సోమ‌వారం నుంచి పిల్లలకు (15 నుంచి 18  సంత్స‌రాల లోపు) కరోనా వ్యాక్సిన్‌ను అందించే కార్య‌క్ర‌మం ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. దీనిలో భాగంగా దేశ‌వ్యాప్తంగా టీనేజ‌ర్ల‌కు వ్యాక్సినేష‌న్ (Vaccination) ప్ర‌క్రియ శ‌ర‌వేగంగా కొన‌సాగుతున్న‌ది. ఇక బుధ‌వారం (జ‌న‌వ‌రి 5న‌) మ‌ధ్యాహ్నం వ‌ర‌కే దేశంలో కోటి మందికిపైగా టీనేజ‌ర్లు తొలి డోస్ వ్యాక్సిన్‌లు తీసుకున్నారు. కేంద్ర ప్ర‌భుత్వ సూచ‌న‌ల మేర‌కు 15-18 ఏండ్ల ఏజ్ గ్రూప్‌లో అంద‌రికీ కొవాగ్జిన్ టీకాలు మాత్ర‌మే ఇస్తున్నారు. ఈ మ‌ధ్యాహ్నానికి దేశ‌వ్యాప్తంగా కోటి మందికిపైగా టీనేజ‌ర్లు తొలి డోస్ టీకాలు వేయించుకున్నార‌ని కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మ‌న్సుఖ్‌ మాండ‌వీయ తెలిపారు.

Also Read: Caste: ప్ర‌ధాని కాన్వాయ్ ని అడ్డుకున్న నిర‌స‌న‌కారులు.. ప్లైఓవ‌ర్‌పై 15నిమిషాల పాటు ప్ర‌ధాని !

Latest Videos

undefined

వ్యాక్సిన్ టీకాలు అందిస్తున్న కేంద్రాల్లో త‌ప్పులు జ‌ర‌గ‌కుండా ఉండేందుకు అధికారులు ముంద‌స్తు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. దీని కోసం 15-18 సంవత్సరాల వయస్సు గల వారికి వ్యాక్సిన్‌లను.. ఇప్ప‌టికే ఇస్తున్న ఏజ్ గ్రూప్ వారి టీకాల‌తో కలపకుండా ఉండేందుకు ప్రత్యేక టీకా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్ర‌త్యేక టీకా బృందాల‌ను రంగంలోకి దించుతున్నారు. దీనికి సంబంధించిన ఆదేశాల‌ను రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం జారీ చేసింది. జనవరి 1 నుండి పిల్లలకు టీకాలు వేయడానికి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభించగా, మొదటి రోజు 15-18 సంవత్సరాల మధ్య 3.23 లక్షల మంది యువకులు నమోదు చేసుకున్నారు. సోమవారం నుండి నిర్దేశించిన టీకా కేంద్రాలల్లో కూడా రిజిస్ట‌ర్ చేసుకోవ‌చ్చు. అనంత‌రం వారికి అక్క‌డ టీకాలు అంద‌జేస్తారు. 18 ఏళ్లు పైబడిన వారందరికీ ప్రభుత్వం కోవిడ్ వ్యాక్సినేషన్‌ను ప్రారంభించినప్పుడు, మొదటి రెండు రోజుల్లో (ఏప్రిల్ 28 మరియు 29) దాదాపు 2.28 కోట్ల రిజిస్ట్రేషన్‌లు నమోదయ్యాయి. పెద్దలతో పోల్చితే ఇప్పటివరకు నమోదైన 15-18 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లల సంఖ్య తక్కువగా ఉన్నప్పటికీ, రెండు వర్గాలకు సంబంధించిన సంఖ్య‌లో గ్యాప్ పెద్ద‌గానే ఉంద‌ని చెప్పాలి. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ అంచనాల ప్రకారం.. 15-18 సంవత్సరాల వయస్సు గల పిల్లలు 7.40 కోట్ల మంది టీకాలు వేసుకోవ‌డానికి అర్హులుగా ఉన్నారు.

Also Read: Caste: coronavirus: జేజే హాస్పిట‌ల్‌లో 61 మంది డాక్ట‌ర్ల‌కు క‌రోనా పాజిటివ్‌

ఇదిలావుండ‌గా, దేశంలో క‌రోనా కేసులు క్ర‌మంగా పెరుతుగున్నాయి. బుధ‌వారం ఉద‌యం కేంద్ర ఆరోగ్య‌, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్ల‌డించిన వివ‌రాల ప్ర‌కారం.. గ‌త 24 గంట‌ల్లో 50వేల‌కు పైగా కొత్త కేసులు (Coronavirus) న‌మోద‌య్యాయి. ఒమిక్రాన్ వేరియంట్ దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల‌కు వ్యాపించింది. ఇదిలావుండ‌గా, దేశంలో క‌రోనా థ‌ర్డ్ వేవ్ (Third Wave) అంచ‌నాలు తీవ్ర భయాందోళ‌న‌కు గురిచేస్తున్నాయి. భార‌త్ లో అప్పుడే క‌రోనా థ‌ర్డ్ వేవ్ ప్రారంభ‌మైంద‌ని నిపుణులు హెచ్చిరిస్తున్నారు. ఈ జ‌న‌వ‌రిలోనే క‌రోనా థ‌ర్డ్ వేవ్ పీక్ స్టేజ్‌కు చేరుకుంటుంద‌ని పేర్కొంటున్నారు. భారతదేశంలో ఓమిక్రాన్ ఇన్ఫెక్షన్ల సంఖ్య జనవరి చివరిలో లేదా ఫిబ్రవరి ప్రారంభంలో గరిష్ట స్థాయికి చేరుకోవచ్చని అమెరికాకు చెందిన‌ ఇనిస్టిట్యూట్‌ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ (IHME) డైరెక్టర్ డాక్టర్ క్రిస్టోఫర్ ముర్రే చెప్పారు. క‌రోనా సెకండ్ వేవ్ స‌మ‌యంలో న‌మోదైన దాని కంటే ఎక్కువ ఇన్ఫెక్షన్లు  వెలుగుచూసే అవ‌కాశ‌ముంద‌ని తెలిపారు. ముఖ్యంగా అత్యంత ప్రమాద‌క‌ర‌మైన‌దిగా భావిస్తున్న క‌రోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ సునామీలో భార‌త్ చుట్టుకునే అవ‌కాశాలు అధికంగా ఉన్నాయ‌ని తెలిపారు.  ప్ర‌స్తుతం ఒమిక్రాన్ కేసులు పెరుగుద‌ల (Third Wave) దీనికి నిద‌ర్శ‌న‌మ‌ని పేర్కొన్నారు. 

Also Read: Caste: CSD Bipin Rawat: బిపిన్‌ రావత్‌ హెలికాఫ్టర్‌ ప్రమాదంపై నివేదిక.. పైలెట్ చివ‌ర‌గా ఏం చెప్పారంటే..

click me!