59 చైనీస్ యాప్స్‌పై నిషేధం.. థాంక్యూ టిక్‌టాక్ అంటూ స్మృతీ ఇరానీ వీడియో, వైరల్

Siva Kodati |  
Published : Jul 03, 2020, 04:02 PM IST
59 చైనీస్ యాప్స్‌పై నిషేధం.. థాంక్యూ టిక్‌టాక్ అంటూ స్మృతీ ఇరానీ వీడియో, వైరల్

సారాంశం

టిక్‌టాక్‌తో సహా 59 చైనా యాప్‌లపై నిషేధంపై భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతుండగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గతంలో చేసిన వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది.

టిక్‌టాక్‌తో సహా 59 చైనా యాప్‌లపై నిషేధంపై భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా మిశ్రమ స్పందన వ్యక్తమవుతుండగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ గతంలో చేసిన వీడియో ఇప్పుడు నెట్‌లో వైరల్ అవుతోంది.

Also Read:మన దెబ్బ గట్టిగానే తగిలిందిగా.. ఒక్క టిక్‌టాక్ వల్ల చైనాకు ఎంత నష్టమో తెలుసా..?

వైరస్‌పై పోరులో భాగంగా టిక్‌టాక్‌కు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇరానీ చేసిన వీడియోను పలువురు ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తున్నారు. సదరు వీడియోలో కరోనాపై ఐక్యంగా పోరాడాలన్న ప్రధాని మోడీ పిలుపునకు లక్షలాది మంది భారతీయుల నుంచి స్పందన లభించిందంటూ ఆమె ధన్యవాదాలు తెలిపారు.

ఈ సందర్భంగా టిక్‌టాక్ పీపీఈ సూట్స్ విరాళాన్ని, భాగస్వామ్యాన్ని ప్రస్తావించిన కేంద్ర మంత్రి టిక్‌టాక్ ఇండియా సీఈవో నిఖిల్ గాంధీకి థ్యాంక్యూ చెప్పడంతో పాటు.. ఈ వీడియో ప్రతీవారికీ చేరాలని కోరడం విశేషం.

Also Read:చైనాకి డాటా లీక్ చేయలేదు.. టిక్‌టాక్ నిషేధం సి‌ఈ‌ఓ స్పందన..

కాగా దేశ భద్రత దృష్ట్యా టిక్‌టాక్, యూసీ బ్రౌజర్, కామ్‌స్కానర్, షేరిట్ సహా 59 చైనా యాప్‌లపై భారత ప్రభుత్వం నిషేధించింది. అయితే దీనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని టిక్‌టాక్ యోచిస్తున్నట్లు పలు నివేదికలు పేర్కొన్నాయి. అయితే ఈ వాదనలను ఆ కంపెనీ తిరస్కరించిన సంగతి తెలిసిందే.

PREV
click me!

Recommended Stories

Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!
ఏమిటీ..! కేవలం పశువుల పేడతో రూ.500 కోట్ల లాభమా..!!