
మహిళా రెజర్లను లైంగికంగా వేధింపులకు గురి చేశాడని డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూషన్ సింగ్ గత కొంత కాలం నుంచి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రెండు విడతలకు భారత అగ్ర శ్రేణి రెజర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేశారు. వారి నిరసన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. కోర్టు ఆదేశాలతో ఎట్టకేలకు ఢిల్లీ పోలీసులు నిందితుడిపై ఎఫ్ఐఆర్ దాఖలు చేసి విచారణ చేపట్టారు.
గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కు అస్వస్థత.. హాస్పిటల్ కు తరలించిన జైలు అధికారులు
దీనిపై కొంత కాలం నుంచి దర్యాప్తు చేపట్టిన ఢిల్లీ పోలీసులు.. రెజర్ల ఆరోపణల్లో నిజం ఉందని తేల్చారు. ఆరుగురు అగ్రశ్రేణి మల్లయోధుల ఫిర్యాదులపై ఇప్పటివరకు జరిగిన దర్యాప్తు ఆధారంగా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ ను ప్రాసిక్యూట్ చేయవలసి ఉంటుందని పేర్కొన్నారు. లైంగిక వేధింపులు, వెంబడించడం వంటి నేరాలకు సింగ్‌పై విచారణ జరిపి శిక్షించాలని ఢిల్లీ పోలీసులు జూన్ 13వ తేదీన దాఖలు చేసిన ఛార్జిషీట్‌లో పేర్కొన్నారని ‘ది న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్’ తన కథనంలో నివేదించింది.
ఆ ఛార్జిషీట్‌లో సెక్షన్‌లు 506 (నేరపూరిత బెదిరింపు), 354 (మహిళ అణకువకు భంగం కలిగించడం), 354ఏ (లైంగిక వేధింపులు), 354డీ (వెంబడించడం) కింద అభియోగాలు మోపింది. ఓ సందర్భంలో బ్రిజ్‌భూషణ్ సింగ్ శరణ్ సింగ్ వేధింపులు ఇంకా ‘కొనసాగుతూనే ఉన్నాయి’ అని పేర్కొంది.
మొత్తంగా 6 కేసుల్లో రెండింటిలో బ్రిజ్ భూషణ్‌పై సెక్షన్లు 354, 354ఏ, 354డీ కింద, నాలుగు కేసుల్లో 354, 354ఏ కింద సెక్షన్ల బుక్ అయ్యాయి. అయితే ఇండోనేషియా, బల్గేరియా, కజకిస్థాన్, మంగోలియా, కిర్గిజిస్థాన్‌లలో జరిగిన టోర్నమెంట్‌లలో తమపై సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళా రెజర్లు ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయా టోర్నమెంట్ల వీడియో, ఫొటోలు తదితరాల కోసం ఢిల్లీ పోలీసులు 5 దేశాల రెజ్లింగ్ సమాఖ్యలకు లేఖలు కూడా రాశారు.
ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్న యమునా నది.. ఢిల్లీకి పొంచి ఉన్న వరద ముప్పు
ఇదిలా ఉండగా.. బ్రిజ్ భూషణ్‌పై నమోదైన రెండు ఎఫ్‌ఐఆర్‌లలో చాలా తీవ్రమైన ఆరోపణలు ఉన్నాయి. వృత్తిపరమైన సహాయానికి బదులుగా లైంగిక సహాయాన్ని కోరిన కనీసం రెండు కేసులు ఈ ఎఫ్ఐఆర్ లు పేర్కొంటున్నాయి. 15 లైంగిక వేధింపుల కేసుల ప్రస్తావన కూడా ఉంది. వాటిలో 10 కేసులు అనుచితంగా తాకినట్లు నివేదించబడ్డాయి. ఎఫ్‌ఐఆర్‌లో తమ అంగీకారం లేకుండా రొమ్ములను, పొట్టను తాకారని ఆరోపిస్తూ మహిళా రెజ్లర్లు ఫిర్యాదు చేశారు. రెండు ఎఫ్‌ఐఆర్‌లలో బెదిరింపుల విషయం కూడా ప్రస్తావించబడింది. కాగా.. ఏప్రిల్ 28న రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.