
ఉగ్రవాదులు మళ్లీ రెచ్చిపోయారు. జమ్మూ కాశ్మీర్‌లోని షోపియాన్ జిల్లా అగ్లార్ జైనాపోరా ప్రాంతంలో ఉగ్రవాదులు గ్రెనేడ్‌తో దాడి చేశారు. దీంతో ఇద్దరు వలస కూలీలకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ దాడి విషయం తెలియడంతో పోలీసులు ఆ ప్రాంతాన్ని చుట్టుముట్టారు. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోంది. కాగా అనంత్‌నాగ్ జిల్లాలోని రిషిపోరా ప్రాంతంలో భద్రతా బలగాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. ఇక్కడ కాల్పుల్లో ముగ్గురు సైనిక సిబ్బంది, ఒక పౌరుడు గాయపడ్డారు. క్షతగాత్రులందరినీ వెంటనే శ్రీనగర్‌లోని 92 బేస్ హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం నిలకడగా ఉందని పోలీసులు తెలిపారు.
Satyendra Nath Bose : సత్యేంద్ర నాథ్ బోస్ కు డూడుల్ తో గూగుల్ నివాళి.. ఇంతకీ ఆయన ఎవరంటే ?
జమ్మూ కాశ్మీర్ లోని బుద్గామ్ జిల్లాలో రాజస్థాన్‌కు చెందిన బ్యాంక్ మేనేజర్‌ని, బీహార్‌కి చెందిన వలస కార్మికుడిని ఉగ్రవాదులు కాల్చి చంపిన ఒక రోజు తర్వాత ఈ పరిణామం చోటు చేసుకుంది. పంజాబ్‌కు చెందిన ఒక వలస కార్మికులపై కూడా ఉగ్రవాది కాల్పులు జరిపాడు. అలాగే బుద్గాం జిల్లా మగ్రేపోరా చదూరా ప్రాంతంలో అర్నియా బీహార్‌కు చెందిన దిల్‌ఖుష్ కుమార్, పంజాబ్‌కు చెందిన రాజన్ అనే ఇద్దరు వలస కార్మికులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. వారు ఇటుక బట్టీలో పనిచేస్తున్నారు. వారి శరీరాలనూ ఉగ్రవాదులు జరిపిన కాల్పుల వల్ల గాయాలు ఏర్పడ్డాయి. వెంటనే వారిని హాస్పిటల్ కు తీసుకెళ్లారు. అయితే దిల్ ఖుష్ కుమార్ హాస్పిటల్ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మరణించాడు.
వలస కార్మికులు, కాశ్మీర్ పండిట్‌లలో భయాందోళనలు కలిగించే ప్రయత్నంలో భాగంగా ఉగ్రవాదులు ఇటీవలి కాలంలో లోయలో దాడులను పెంచుతున్నారు. అందులో భాగంగానే ఈ వారం ప్రారంభంలో ఓ ఉగ్రవాది సాంబాకు చెందిన రజినీ బాలా అనే మహిళా హిందూ ఉపాధ్యాయిని కాల్చి చంపాడు. ఆమె కుల్గాంలో పని చేస్తున్నారు. ఆమె కంటే ముందే కశ్మీర్ పండిట్ రాహుల్ భట్ ను ఆయన కార్యాలయంలోనే కాల్చి చంపారు. తహసీల్ కార్యాలయంలో క్లర్క్‌గా పని చేస్తున్న ఆయన హత్యకు గురవడంతో లోయ ప్రాంతంలో పండిట్లు ఆందోళన చేపట్టారు.
జమ్మూకాశ్మీర్ లో మళ్లీ ఉగ్ర కార్యకలాపాలు క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రాంతంలో ప్రజల్లో మళ్లీ భయాందోళనలు నెలకొన్నాయి. కాగా గత నెల రోజులుగా హిందువులపై జరిగిన హత్యల నేపథ్యంలో జమ్మూకాశ్మీర్ లోయలో తలెత్తిన పరిస్థితులను సమీక్షించేందుకు హోంమంత్రి అమిత్ షా అధ్యక్షతన శుక్రవారం ఉన్నత స్థాయిలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, సీఆర్పీఎఫ్ డీజీ, బీఎస్ఎఫ్ డీజీ, ఐబీ, రా చీఫ్ కూడా హాజరయ్యారు. లోయలో జరుగుతున్న ఓ వర్గ ప్రజలను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న హత్యలు, దానికి పరి ఈ సమావేశంలో ప్రధాన అజెండాగా చర్చింరారు. కశ్మీరీ పండిట్ల హత్య,అమర్‌నాథ్ యాత్ర భద్రతపై కూడా సమీక్ష జరిపారు.