హర్యానా-పంజాబ్ సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత నెలకొంది. రైతులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. దీంతో అక్కడ కొంత ఆందోళనకర పరిస్థితితులు నెలకొన్నాయి. బారికేడ్లను తొలగించాలని, తమను ఢిల్లీకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని రైతులు ప్రభుత్వాన్ని కోరారు.
తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ రైతు సంఘాలు తలపెట్టిన ‘ఢిల్లీ చలో’ నిరసన కార్యక్రమం మళ్లీ ప్రారంభమైంది. కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) హామీలపై కేంద్రంతో చర్చలు విఫలం కావడంతో రైతులు మళ్లీ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో పంజాబ్-హర్యానా సరిహద్దులో మళ్లీ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. భద్రతా దళాలు రైతులపై బుధవారం ఉదయం అడపాదడపా బాష్పవాయు గోళాలను ప్రయోగించాయి.
ఢిల్లీని ముట్టడించడానికి 1,200 ట్రాక్టర్ ట్రాలీలు, 300 కార్లు, 10 మినీ బస్సులతో సుమారు 14,000 మంది రైతులు సరిహద్దు వెంబడి గుమిగూడారు. పోలీసు బారికేడ్లను తొలగించడానికి నిరసనకారులు ప్రత్యేక పరికరాలను కూడా తీసుకొచ్చాయి. అయితే వాటిని స్వాధీనం చేసుకోవాలని మర్యానా పోలీసులు పంజాబ్ పోలీసులను కోరారు. మరో వైపు రైతులు దేశ రాజధానికి తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఢిల్లీ పోలీసులు అప్రమత్తమై ప్రవేశ మార్గాలను సురక్షితంగా ఉంచేందుకు విన్యాసాలు నిర్వహిస్తున్నారు.
Farmers Protest in Shambhu Border pic.twitter.com/HGKmzHYOt8
— Ashish Singh (@AshishSinghKiJi)
undefined
కాగా.. రైతులు శాంతియుతంగా నిరసన తెలుపుతారని కిసాన్ మజ్దూర్ మోర్చా నాయకుడు సర్వాన్ సింగ్ పంధేర్ పునరుద్ఘాటించారు, బారికేడ్లను తొలగించాలని. తమను ఎలాంటి ఆటంకం లేకుండా ఢిల్లీకి అనుమతించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. తమ వైపు నుంచి అన్ని ప్రయాత్నాలు చేశామని, సమావేశాలకు హాజరయ్యామని తెలిపారు. ప్రతీ అంశంపై చర్చించామని, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అన్నారు. తాము శాంతియుతంగా ఉంటామని, ఈ అడ్డంకులను తొలగించి ఢిల్లీ వైపు ర్యాలీ తీయడానికి తమకు అనుమతి ఇవ్వాలని కోరారు.
Is this Peaceful Protest?? Do Protesters bring proclain machine to use in any protest. What about the Law and order? They are raging war against the country for their own vested interests. they are not farmers; they are landlords and land mafia. pic.twitter.com/MonVHIuH8L
— Punjab Panther (@Punjab_panther)అంతకు ముందు ఆయన సర్వాన్ సింగ్ పంధేర్ మాట్లాడుతూ, పంటలకు ఎంఎస్పీపై చట్టాన్ని తీసుకొచ్చేందుకు ఒక రోజు ప్రత్యేకంగా పార్లమెంట్ సమావేశాన్ని ఏర్పాటు చేయాలని అన్నారు. ఎంఎస్పీకి హామీ ఇచ్చేలా చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ప్రధానికి చిత్తశుద్ధి ఉంటే దీని కోసం ఒక రోజు పార్లమెంటు సమావేశాలు నిర్వహించవచ్చని, దీనిని ఏ ప్రతిపక్ష పార్టీ వ్యతిరేకిందని అన్నారు.