న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియం గేట్ సమీపంలో తాత్కాలిక నిర్మాణం కుప్పకూలింది.ఈ ఘటనలో ఎనిమిది మంది గాయపడ్డారు.
న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రు స్టేడియం గేట్ సమీపంలోని తాత్కాలిక నిర్మాణం కుప్పకూలడంతో ఎనిమిది మంది గాయపడ్డారు. జవహర్ లాల్ నెహ్రు కు స్టేడియం రెండో నెంబర్ గేట్ కు సమీపంలో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ నిర్మాణ పనుల్లో కొంత భాగం కూలిపోయింది. నిర్మాణ భాగంలోని శిథిలాల కింద కార్మికులు చిక్కుకున్నారు.ఇందులో ఎనిమిది మంది గాయపడ్డారు. ఈ విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
ఈ ఘటనలో గాయపడిన కార్మికులను ఆసుపత్రికి తరలించారు. ఈ శిథిలాల కింద ఇంకా కొందరు కార్మికులు చిక్కుకున్నారేమోననే అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు గల కారణాలపై అధికారులు ఆరా తీస్తున్నారు.
ఓ పెళ్లి కోసం తాత్కాలిక నిర్మాణాన్ని ఏర్పాటు చేసినట్టుగా అధికారులు చెబుతున్నారు. కార్మికులు మధ్యాహ్న భోజనం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. దీంతో నిర్మాణ పనుల్లో ఎక్కువ మంది కార్మికులు లేరు. దీంతో ఈ ప్రమాదం జరిగిన సమయంలో కార్మికులు ఎక్కువగా లేరు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఉన్న కార్మికులు గాయపడ్డారని ప్రత్యక్షసాక్షులు చెప్పారని జాతీయ మీడియా కథనాలు చెబుతున్నాయి.