మండే ఎండ‌లు.. ఈ సారి సాధార‌ణం కంటే అధిక ఉష్ణోగ్ర‌తలు : ఐఎండీ హెచ్చ‌రిక‌లు

Published : Apr 01, 2023, 03:19 PM IST
మండే ఎండ‌లు.. ఈ సారి సాధార‌ణం కంటే అధిక ఉష్ణోగ్ర‌తలు : ఐఎండీ హెచ్చ‌రిక‌లు

సారాంశం

New Delhi: ఏప్రిల్-జూన్ మధ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండ‌లు మండిపోతాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) తెలిపింది. ఈ వేస‌విలో ఎండ‌లు మరింత ఎక్కువగా ఉంటాయనీ, సాధారణం కంటే అధిక‌ ఉష్ణోగ్రతలు న‌మోద‌వుతాయ‌ని హెచ్చ‌రించింది.   

Hot summer in most parts of India-IMD: దేశంలోని చాలా ప్రాంతాల్లో అప్పుడే ఎండ‌లు మండిపోతున్నాయి. క్ర‌మంగా ఉష్ణోగ్ర‌త‌లు పెరుగుతున్న ప‌రిస్థితులు ఉన్నాయి. అయితే, రానున్న రోజుల్లో దేశంలో ఎండ‌లు మ‌రింత అధికంగ ఉంటాయ‌ని భార‌త వాతావ‌ర‌ణ విభాగం (ఐఎండీ) పేర్కొంది. ఏప్రిల్-జూన్ మధ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఎండ‌లు మండిపోతాయ‌ని తెలిపింది. ఈ వేస‌విలో ఎండ‌లు మరింత ఎక్కువగా ఉంటాయనీ, సాధారణం కంటే అధిక‌ ఉష్ణోగ్రతలు న‌మోద‌వుతాయ‌ని హెచ్చ‌రించింది. 

వివ‌రాల్లోకెళ్తే.. వాయువ్య, ద్వీపకల్ప ప్రాంతాలు మినహా భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో ఏప్రిల్ నుండి జూన్ వరకు సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (ఐఎండి) శనివారం తెలిపింది. ఈ కాలంలో మధ్య, తూర్పు, వాయువ్య భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వడగాలులు వీస్తాయని పేర్కొంది. బీహార్, జార్ఖండ్, ఉత్తరప్రదేశ్, ఒడిశా, పశ్చిమబెంగాల్, ఛత్తీస్ గ‌ఢ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, హర్యానాలోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీస్తాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర వర్చువల్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో తెలిపారు.

"2023 వేడి వాతావరణ సీజన్ లో (ఏప్రిల్ నుండి జూన్ వరకు), దక్షిణ ద్వీపకల్ప భారతదేశం-వాయువ్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాలు సాధారణం కంటే ఎక్కువ గరిష్ట ఉష్ణోగ్రతలను అనుభవించే అవకాశం ఉంది" అని ఐఎండీ తెలిపింది. ఈశాన్య, వాయవ్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, ద్వీపకల్ప ప్రాంతంలోని కొన్ని ప్రాంతాలు మినహా దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం నుంచి సాధారణం కంటే ఎక్కువ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంద‌ని హెచ్చ‌రించింది. దీంతో పాలు ప‌లు ప్రాంతాల్లో ఏప్రిల్ లో భారత్ లో సాధారణ వర్షపాతం నమోదవుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

వాయవ్య, మధ్య, ద్వీపకల్ప ప్రాంతాల్లోని చాలా ప్రాంతాల్లో సాధారణం నుంచి అంతకంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుంద‌నీ,  తూర్పు, ఈశాన్య భారతంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని ఐఎండీ పేర్కొంది. 

ఇదిలావుండ‌గా, ఎండులు మండిపోతున్న త‌రుణంలో ప్ర‌జ‌లు వ‌డ‌దెబ్బ బారిన‌ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని ప్ర‌భుత్వాలు ప్ర‌జ‌లు సూచిస్తున్నాయి. అలాగే, విద్యుత్ వినియోగం క్ర‌మంగా పెరుగుతుండ‌టంతో కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భ‌త్వాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ఈ క్ర‌మంలోనే దేశంలోని బొగ్గు ఆధారిత విద్యుత్ ప్లాంట్లను పూర్తి స్థాయిలో పనిచేయాలని భారత ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది ఆదేశించింది. కానీ ఈ సంవత్సరం ఆర్డర్ గత సంవత్సరం కంటే మరింత విస్తృతంగా ఉంది.  బొగ్గు, చమురు ఆధారిత జనరేటర్లన్నీ ఏప్రిల్ నుండి జూన్ వరకు మొత్తం వేసవిలో గరిష్టంగా ఉపయోగించబడతాయి. ఇది ఇప్పటికే ఆకాశాన్నంటుతున్న భారత్ వాయు ఉద్గారాలను గణనీయంగా పెంచుతుందని విశ్లేషకులు అంటున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం