జర్నలిస్టులను టార్గెట్ చేయడంలో కాశ్మీర్ తర్వాత రెండో స్థానంలో తెలంగాణ

Published : Jun 28, 2023, 05:28 PM IST
జర్నలిస్టులను టార్గెట్ చేయడంలో కాశ్మీర్ తర్వాత రెండో స్థానంలో తెలంగాణ

సారాంశం

194 journalists targeted in India 2022: ఢిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ రైట్స్ అండ్ రిస్క్ అనాలిసిస్ గ్రూప్ (RRAG) వెల్లడించిన వివరాల ప్రకారం 2022లో భారతదేశంలో కనీసం 194 మంది జర్నలిస్టులను ప్రభుత్వ సంస్థలు, రాష్ట్రేతర రాజకీయ నాయకులు, క్రిమినల్స్, సాయుధ ప్రతిపక్ష గ్రూపులు లక్ష్యంగా చేసుకున్నాయి. 103 మంది పాత్రికేయులు ప్రభుత్వ అధికారుల నిఘాలో ఉన్నారనీ, మిగిలిన వారిని రాజకీయ కార్యకర్తలతో సహా రాష్ట్రేతర వ్యక్తులు లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొంది. జ‌మ్మూకాశ్మీర్, మణిపూర్ స‌హా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 91 మంది జర్నలిస్టులపై సాయుధ ప్రతిపక్ష గ్రూపులు దాడి చేశాయని నివేదిక తెలిపింది.

Rights and Risks Analysis Group report : ఢిల్లీకి చెందిన థింక్ ట్యాంక్ రైట్స్ అండ్ రిస్క్ అనాలిసిస్ గ్రూప్ (RRAG) వెల్లడించిన వివరాల ప్రకారం 2022లో భారతదేశంలో కనీసం 194 మంది జర్నలిస్టులను ప్రభుత్వ సంస్థలు, రాష్ట్రేతర రాజకీయ నాయకులు, క్రిమినల్స్, సాయుధ ప్రతిపక్ష గ్రూపులు లక్ష్యంగా చేసుకున్నాయి. 103 మంది పాత్రికేయులు ప్రభుత్వ అధికారుల నిఘాలో ఉన్నారనీ, మిగిలిన వారిని రాజకీయ కార్యకర్తలతో సహా రాష్ట్రేతర వ్యక్తులు లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొంది. జ‌మ్మూకాశ్మీర్, మణిపూర్ స‌హా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 91 మంది జర్నలిస్టులపై సాయుధ ప్రతిపక్ష గ్రూపులు దాడి చేశాయని నివేదిక తెలిపింది.

వివరాల్లోకెళ్తే.. రైట్స్ అండ్ రిస్క్ అనాలిసిస్ గ్రూప్ (ఆర్ఆర్ఏజీ) నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో భారతదేశం అంతటా జర్నలిస్టులను లక్ష్యంగా చేసుకోవడంలో జమ్మూ కాశ్మీర్, తెలంగాణ వరుసగా మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి. జ‌ర్న‌లిస్టుల్లో ఏడుగురు మహిళా పాత్రికేయులతో సహా మొత్తం 194 మంది జర్నలిస్టులను ప్రభుత్వ సంస్థలు, రాష్ట్రేతర రాజకీయ నాయకులు, క్రిమినల్స్, సాయుధ ప్రతిపక్ష బృందాలు (ఏఓజీలు) లక్ష్యంగా చేసుకున్నాయని నివేదిక పేర్కొంది. జ‌మ్మూకాశ్మీర్ లో అత్య‌ధికంగా 48 మంది జ‌ర్న‌లిస్టుల‌ను టార్గెట్ చేశారు. ఆ తర్వాతి స్థానంలో ఉన్న‌ తెలంగాణలో 40 మంది జ‌ర్న‌లిస్టులను ల‌క్ష్యంగా దాడులు చేశారు. ఆ త‌ర్వాత స్థానాల్లో ఒడిశా (14), ఉత్తరప్రదేశ్ (13), ఢిల్లీ (12), పశ్చిమ బెంగాల్ (11), మధ్యప్రదేశ్ (6), మణిపూర్ (6); అస్సాం (5), మహారాష్ట్ర (5), బీహార్ (4), క‌ర్నాట‌క (4), పంజాబ్ (4), ఛ‌త్తీస్ గ‌ఢ్ (3), జార్ఖండ్ (3), మేఘాలయ (3),  అరుణాచల్ ప్రదేశ్ (2), తమిళనాడు (2), ఆంధ్రప్రదేశ్, గుజరాత్, హర్యానా, పుదుచ్చేరి, రాజస్థాన్, త్రిపుర, ఉత్తరాఖండ్ (ఒక్కొక్కరు చొప్పున‌) ఉన్నాయి.

103 మంది పాత్రికేయులలో 70 మంది పాత్రికేయులను అరెస్టు చేశారు లేదా నిర్బంధించారు. 14 మంది జర్నలిస్టులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు జారీ చేసిన నలుగురు జర్నలిస్టులు ఉన్నారు. ఇమ్మిగ్రేషన్ అధికారులచే విదేశాలకు వెళ్లకుండా నిరోధించడం సహా ప్రభుత్వ అధికారులు / పోలీసులచే శారీరకంగా దాడి చేయబడిన, బెదిరించబడిన-వేధింపులకు గురైన 15 మంది పాత్రికేయులు ఉన్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Republic Day Parade: ఘనంగా గణతంత్ర దినోత్సవ పరేడ్ సన్నాహాలు| Asianet News Telugu
Fresh Snowfall in Shimla Delights Tourists: రికార్డు స్థాయిలో సిమ్లాలో మంచు వర్షం| Asianet Telugu