
పూణేలో తన స్నేహితుడు దాడికి పాల్పడుతుండగా బాలికను కాపాడిన లేష్‌పాల్‌ను మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎన్ఎంఎస్) చీఫ్ రాజ్ థాక్రే ప్రశంసించారు. తన ప్రేమను నిరాకరించిందన్న అక్కసుతో ఆమెపై నిందితుడు కొడవలితో దాడి చేశాడు. దీనిపై బుధవారం ట్విట్టర్ ద్వారా స్పందించారు థాక్రే. ‘‘నిన్న పూణేలో ఓ మహిళపై దురదృష్టకర ఘటన చోటు చేసుకుంది. తోటివారంతా చూస్తుండగా లేష్‌పాల్ అనే యువకుడు బాలికను రక్షించాడు. తాను లేష్‌పాల్‌ను అతని ధైర్యాన్ని మెచ్చుకుంటాను. ఇంతమంది ప్రజలు ఎందుకు ప్రేక్షకపాత్ర వహించారో తనకు అర్ధం కాక ఆశ్చర్యంగా వున్నానంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఈ వ్యవహారంపై ఎలాంటి విచారణ జరగడం లేదన్న సందేహాన్ని నివృత్తి చేసేందుకు పోలీసులు ప్రజలకు హామీ ఇవ్వాలని రాజ్ థాక్రే కోరారు. దర్శన పవార్ (బాధితురాలు) హత్య కేసును ప్రస్తావిస్తూ ఇలాంటివి మళ్లీ జరగడం తీవ్రమైనదిగా థాక్రే ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుడితో పెళ్లికి నిరాకరించినందుకే దర్శన హత్యకు గురైందని సమాచారం. పూణేలోని రాయ్‌గఢ్ కోటలో దర్శన (26) మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద మొబైల్ ఫోన్, పర్సు, బూట్లు, స్కార్ప్‌ను స్వాధీనం చేసుకున్నారు.