ఢిల్లీ మెట్రోలో భారీ ఫైట్.. దారుణంగా కొట్టుకున్న ఇద్దరు వ్యక్తులు.. వైరల్ అవుతున్న వీడియో

Published : Jun 28, 2023, 05:04 PM IST
ఢిల్లీ మెట్రోలో భారీ ఫైట్.. దారుణంగా కొట్టుకున్న ఇద్దరు వ్యక్తులు.. వైరల్ అవుతున్న వీడియో

సారాంశం

ఢిల్లీ మెట్రో కు సంబంధించిన మరో వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో ఇద్దరు వ్యక్తులు ఘర్షణకు దిగారు. మిగితా ప్రయాణికులను వారిని విడిపించేందుకు ప్రయత్నించారు. 

ఢిల్లీ మెట్రో కోచ్ లో జరిగిన ఘర్షణకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఇద్దరు వ్యక్తులు ఒకరినొకరు తోసుకుంటూ దారుణంగా కొట్టుకోవడం కనిపిస్తోంది. ఈ వీడియో రాజా నహర్ సింగ్- కాశ్మీరీ గేట్ మధ్య వయొలెట్ లైన్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది.

హిమాచల్ లో ఘోర రోడ్డు ప్రమాదం.. కారు లోయలో పడటంతో నలుగురు మృతి, ఒకరికి గాయాలు

ఘర్షణకు దిగిన ఇద్దరిని ఆపేందుకు ఆ మెట్రో బోగీలో ఉన్న ఇతర ప్రయాణికులు ప్రయత్నించారు. ఒకరి నుంచి మరొకరిని దూరం జరిపారు. అనంతరం వారిలో ఒకరిని మైట్రో రైలు దించారు. ఇదిలా ఉంటే తాజా గొడవ ఘటనపై నెటిజన్లు సరదాగా స్పందిస్తుండగా, మరికొందరు వారిపై చర్యలు తీసుకోవాలని మెట్రో అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఓ యూజర్ తన ఇన్ స్టాగ్రామ్ ఖాతాలో.. ఈ మెట్రోను ఏక్తా కపూర్ డిజైన్ చేసినట్టు కనిపిస్తోందని ట్వీట్ చేశారు.

ఇటీవల ఢిల్లీ మెట్రోలో జంట ముద్దులు పెట్టుకోవడం, రీల్స్ వేయడం, ఇతర అభ్యంతరకర చర్యలతో సహా డజన్ల కొద్దీ వింత సంఘటనలు చోటుచేసుకున్నాయి. మెట్రోలో ప్రయాణికులు సక్రమంగా ప్రవర్తించాలని మెట్రో అధికారులు పలుమార్లు సూచించినా ప్రయోజనం లేకపోయింది.

పొలంలో నాట్లు వేస్తుండగా తెగిపడ్డ 11 కేవీ విద్యుత్ తీగ.. నలుగురు మహిళలు మృతి, మరో ఇద్దరి పరిస్థితి విషమం

కొంత కాలం కిందట ఓ జంట ముద్దు పెట్టుకున్న వీడియో వైరల్ కావడంతో నెటిజన్లలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. మెట్రో రైళ్లలో రీల్స్ పెట్టుకోవద్దని, ప్రయాణికులకు అసౌకర్యం కలిగించే ఎలాంటి కార్యకలాపాలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఢిల్లీ మెట్రో హెచ్చరించింది.
 

PREV
click me!

Recommended Stories

Indigo Crisis: రామ్మోహ‌న్ నాయుడికి క్ష‌మాప‌ణ‌లు చెప్పిన ఇండిగో సీఈఓ.. ఏమ‌న్నారంటే.
Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !