Telangana: రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌పై సీఎం కేసీఆర్ న‌జ‌ర్.. బీజేపీ చెక్‌పెట్టే వ్యూహాలతో ముందుకు..

Published : Apr 15, 2022, 10:01 AM IST
Telangana:  రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌పై సీఎం కేసీఆర్ న‌జ‌ర్.. బీజేపీ చెక్‌పెట్టే వ్యూహాలతో ముందుకు..

సారాంశం

Presidential poll: త్వ‌ర‌లోనే రాష్ట్రప‌తి ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. అయితే, బీజేపీయేత‌ర‌ పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించి ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిని నిలబెట్టేందుకు ప్రాంతీయ పార్టీలతో సీఎం కేసీఆర్ సంప్రదింపులు ప్రారంభించారు. బీజేపీకి చెక్ పెట్టాలని చూస్తున్నారు.   

CM KCR:  గ‌త కొంత కాలంగా భార‌తీయ జ‌న‌తా పార్టీ (బీజేపీ), తెలంగాణ రాష్ట్ర స‌మితిల మ‌ధ్య పోరు మ‌రింత‌గా ముదురుతోంది. ఇరు పార్టీల నేత‌లు ఒక‌రిపై ఒక‌రు తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు గుప్పించుకుంటున్నారు. వ‌రి కోనుగోలు అంశంతో ఇది మ‌రింత‌గా ముదిరింది. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్వ‌యంగా రంగ‌లోకి దిగి.. బీజేపీ పై పోరు సైర‌న్ మోగించారు. ఇప్ప‌టికే బీజేపీయేత‌ర పాలిత రాష్ట్రాల ముఖ్య‌మంత్రులలో ప‌లుమార్లు స‌మావేశ‌మ‌య్యారు. బీజేపీకి వ్య‌తిరేకంగా ప్ర‌తిప‌క్ష  కూట‌మిని ఏర్పాటు చేయ‌డంలో చురుగ్గా ముంద‌కు క‌దులుతున్నారు. రానున్న లోక్ స‌భ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కేసీఆర్ రాజ‌కీయ వ్యూహాలు కీల‌కంగా మార‌నున్నాయ‌ని తెలుస్తోంది. అయితే, లోక్‌స‌భ ఎన్నిక‌ల కంటే ముందు రాష్ట్ర‌ప‌తి ఎన్నిక కూడా జ‌ర‌గ‌నుంది. బీజేపీ చెక్ పెడుతూ.. ప్ర‌తిప‌క్ష‌ల త‌ర‌ఫున అభ్య‌ర్థిని నిల‌బెట్టి గెలిపించుకోవాల‌ని తీరున సీఎం కేసీఆర్ అడుగుల వేస్తున్న ప‌రిస్థితులు కనిపిస్తున్నాయి. 

సీఎం కేసీఆర్ రాష్ట్రప‌తి ఎన్నిక‌ల‌పై న‌జ‌ర్ పెట్టిన‌ట్టు తెలిసింది.  జులైలో జరగనున్న రాష్ట్రపతి ఎన్నికల్లో ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిని బరిలోకి దింపడం ద్వారా బీజేపీని గ‌ట్టిదెబ్బ కొట్టేందుకు సీఎం కేసీఆర్ తన శక్తియుక్తులను కేంద్రీకరించారు. రాష్ట్రపతి ఎన్నికలకు ఉమ్మడి ప్రతిపక్షాల అభ్యర్థిని నిలబెట్టేందుకు బీజేపీయేతర పార్టీల మధ్య ఏకాభిప్రాయం సాధించేందుకు ఆయ‌న ప్రాంతీయ పార్టీలతో సంప్రదింపులు ప్రారంభించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ముఖ్యమంత్రి తన ఆలోచనను తృణమూల్ కాంగ్రెస్,డీఎంకే, శివసేన, సమాజ్ వాదీ పార్టీ, సీపీఎం వంటి ఇతర పార్టీలను ఈ అంశంలో ఏక‌తాటిపైకి తీసుకురావడానికి ఏప్రిల్ చివరి నుండి కొన్ని రాష్ట్రాలను సందర్శించాలని నిర్ణయించుకున్నారని సంబంధిత వ‌ర్గాలు వెల్ల‌డించాయి. రాష్ట్రపతి ఎన్నికల్లో సొంతంగా గెలవాలంటే బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేకు 9,194 ఓట్లు తక్కువగా ఉన్నాయని ఆ వర్గాలు తెలిపాయి. YSR కాంగ్రెస్, బిజూ జనతాదళ్ పాత్ర - ఎలక్టోరల్ కాలేజీలో గణనీయమైన సంఖ్యలో ఓట్లను కలిగి ఉండటం - రాష్ట్రపతి ఎన్నికల్లో కీలకంగా మార‌నుంది. 2017లో రెండు పార్టీలు బీజేపీ అభ్యర్థికి మద్దతిచ్చాయి.

ఎన్డీయే అభ్యర్థికి మద్దతివ్వకుండా బీజేడీ, వైఎస్సార్‌సీ వంటి ప్రాంతీయ పార్టీలను బీజేపీయేతర పార్టీలు ఒప్పించగలిగితే, ప్రతిపక్షాలకు ఎన్నికల్లో విజయం సాధించే అవకాశం లేదా కనీసం ఎన్నికల బరిలో నిలిచే అవకాశం ఉంటుందని చంద్రశేఖర్ రావు భావిస్తున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. 2024 లోక్‌సభ ఎన్నికల కోసం బీజేపీ వ్యతిరేక ఫ్రంట్‌ను ఏర్పాటు చేయడంలో బీజేపీకి వ్యతిరేకంగా బలమైన పోరాటం సాగుతుంది. బీజేపీ సొంతంగా లేదా కూటమిలో - 17 రాష్ట్రాలు మరియు ఒక కేంద్ర పాలిత ప్రాంతంలో అధికారంలో ఉంది. భారత రాష్ట్రపతిని 776 మంది పార్లమెంటేరియన్లు మరియు 4,120 మంది శాసనసభ్యులు ఏర్పాటు చేసిన ఎలక్టోరల్ కాలేజీ ద్వారా ఎన్నుకుంటారు. ప్రెసిడెంట్ పోల్ కోసం, ఎలక్టోరల్ కాలేజీలో మొత్తం 1,098,903 ఓట్లు ఉన్నాయి. మొత్తం 6,264 ఓట్ల విలువ కలిగిన జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ సస్పెన్షన్‌లో ఉండటంతో, మెజారిటీ మార్క్ 546,320 ఓట్లకు పడిపోయింది. బీజేపీకి 4,65,797 ఓట్లు మరియు దాని కూటమి భాగస్వాములకు 71,329 ఓట్లు ఉన్నాయి. మొత్తం 5,37,126 ఓట్లకు చేరుకుంది. ఇది రాష్ట్రపతి ఎన్నికల్లో గెలవడానికి అవసరమైన మెజారిటీకి 9,194 ఓట్లు తక్కువ. దీని బేస్ చేసుకుని సీఎం కేసీఆర్ రాష్ట్రప‌తి ఎన్నిక‌ల్లో చ‌క్రం తిప్పాల‌ని చూస్తున్న‌ట్టు తెలుస్తోంది. 

ఎంపీకి ఒక్కో ఓటు విలువ 708. ఎమ్మెల్యేల విషయానికొస్తే ఒక్కో ఓటు విలువ ఒక్కో రాష్ట్రానికి ఒక్కోలా ఉంటుంది. ఉత్తరప్రదేశ్‌లో ఎమ్మెల్యే ఓటు అత్యధికంగా 208గా ఉంది. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో రెండోసారి జరిగిన ఎన్నికల్లో బీజేపీ యూపీలో అధికారాన్ని నిలబెట్టుకున్నప్పటికీ, 2017లో 312తో పోలిస్తే అసెంబ్లీలో దాని బలం 255కి తగ్గింది. ఇది రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలకు ఆశలు రేకెత్తించిందనే చెప్పాలి. 2017లో ఎన్డీయే అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ 6,61,278 ఓట్లతో గెలుపొందగా, కాంగ్రెస్ నేతృత్వంలోని ఉమ్మడి ప్రతిపక్ష అభ్యర్థి మీరా కుమార్‌కు 4,34,241 ఓట్లు వచ్చాయి. 2017లో టీఆర్‌ఎస్‌, వైఎస్‌ఆర్‌సీ, తెలుగుదేశం, బీజేడీలు ఎన్‌డీఏకు మద్దతిచ్చాయి.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

ఇండిగో విమానాలను దెబ్బకొట్టింది ఏంటి? అసలు ఈ ఎఫ్‌డిటిఎల్ అంటే ఏమిటి?
Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం