
అహ్మదాబాద్:ఎంఐఎం చీఫ్ Asaduddin Owaisiకి గుజరాత్ రాష్ట్రంలో నిరసన సెగ తాకింది. :Gujarat రాష్ట్రంలో త్వరలో అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఈ తరుణంలో గుజరాత్ రాష్ట్రంలో పర్యటనకు వెళ్లిన అసుద్దీన్ ఓవైసీకి ముస్లింలు నిరసనకు దిగారు. అసదుద్దీన్ ఓవైసీని కాన్వాయ్ కు నల్లజెండాలు చూపి నిరసనకు దిగారు. అసుద్దీన్ ఓవైసీ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు.
గుజరాత్ రాష్ట్రంలో Ahmedabadలో MIM చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ పర్యటనలో ముస్లింలు ఈ పర్యటనను అడ్డుకున్నారు. అహ్మదాబాద్ లో ఇఫ్తార్ విందులో పాల్గొనేందుకు అసద్ వెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకొంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అసదుద్దీన్ ఓవైసీని వెనక్కి వెళ్లిపోవాలని కూడా నిరసనకారులు నినాదాలు చేశారు.
దేశంలోని పలు రాష్ట్రాల్లో పాాగా వేయాలని ఎంఐఎం ప్లాన్ చేస్తుంది. ఇందులో భాగంగా ఎన్నికలు జరిగే రాష్ట్రాల్లో పోటీ చేయాలని కూడా ఆ పార్టీ నిర్ణయం తీసుకుంది. గతంలో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ చేసింది. ఎంఐఎం పోటీ చేయడం వల్ల కొన్ని పార్టీల గెలుపు ఓటములపై ప్రభావం చూపింది. తమిళనాడు, బీహార్,ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల ఎన్నికల్లో ఎంఐఎం పోటీ చేసింది. యూపీ రాష్ట్రంలో బీజేపీ పోటీ చేయడంతో ముస్లిం ఓట్లలో చీలిక వచ్చిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎంఐఎం పోటీ చేయడం పరోక్షంగా బీజేపీకి మేలు చేస్తుందని కాంగ్రెస్ నేతలు ఘాటుగానే విమర్శలు చేశారు. ఈ ఏడాది డిసెంబర్ మాసంలో గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి.ఈ రాష్ట్రంలో కూడా పోటీ చేయాలని ఎంఐఎం భావిస్తుంది. అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎంఐఎం చీఫ్ గుజరాత్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. గురువరాం నాడు అహ్మదాబాద్ లో ఇఫ్తార్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న సమయంలో ముస్లింలు ఆయన కాన్వాయ్ కు అడ్డు తగిలారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
గతంలో యూపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రచారం చేసి తిరిగి వెళ్తున్న సమయంలో అసద్ కాన్వాయ్ పై దుండగులు కాల్పులకు దిగారు.ఈ ఘటనకు పాల్పడిన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.ఈ ఘటన తర్వాత అసద్ కు భద్రతను కట్టుదిట్టం చేశారు. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ విషయమై పార్లమెంట్ లో కూడా ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ నేతృత్వంలో ఏర్పాటు చేయబోయే ఫ్రంట్ కు తాము సంపూర్ణ మద్దతును ఇస్తామని అసదుద్దీన్ ఓవైసీ గతంలోనే ప్రకటించారు. తెలంగాణలో టీఆర్ఎస్ కు ఎంఐఎం మిత్రపక్షంగా కొనసాగుతుంది. బీజేపీ వ్యతిరేకంగా ఏర్పాటయ్యే పార్టీల ఫ్రంట్ లో ఎంఐఎం కూడా కీలకంగా వ్యవహరించే అవకాశం ఉంది. అయితే ఆయా రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీ చేయడం పరోక్షంగా బీజేపీకి కలిసివచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా బీజేపీయేతర పార్టీలు వ్యక్తం చేస్తున్నాయి.
బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలు బలపడాల్సిన ఆవశ్యకతను ఎంఐఎంకు ఆ పార్టీలు గుర్తు చేస్తున్నాయి. ఈ తరుణంలో కొన్ని రాష్ట్రాల్లో ఎంఐఎం పోటీకి దూరంగా ఉంటేనే మేలనే అభిప్రాయాలు కూడా వ్యక్తం చేస్తున్నాయి. అయితే రాజకీయంగా తాము బలపడాలనే ఎంఐఎం పోటీ చేస్తున్నట్టుగా చెబుతుంది.