New Delhi: భారత్ లో కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 44175135 చేరుకుంది. మరణాల రేటు 1.19 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
Coronavirus update india: దేశంలో కరోనా వైరస్ కొత్త కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో యాక్టివ్ కేసులు సైతం అధికం అవుతున్నాయి. అయితే, భారత్ లో కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 44175135 చేరుకుంది. మరణాల రేటు 1.19 శాతంగా నమోదైందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ తాజా గణాంకాల ప్రకారం.. భారతదేశంలో గత 24 గంటల్లో కొత్తగా 3,641 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. క్రియాశీల కేసుల సంఖ్య 20,219 కు పెరిగింది. కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 44175135 చేరుకోగా, మరణాల రేటు 1.19 శాతంగా నమోదైంది. దేశవ్యాప్త వ్యాక్సినేషన్ డ్రైవ్ లో భాగంగా ఇప్పటివరకు 220.66 కోట్ల డోసుల కోవిడ్ -19 వ్యాక్సిన్లను ఇచ్చినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది.
undefined
కాగా, గత మూడు రోజులుగా దేశంలో మూడు వేలకు పైగా కరోనా వైరస్ కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం దేశంలో రోజువారీ కేసులు 3,824, శనివారం 3,095గా ఉన్నాయి. తాజాగా 3,641 కేసులు వెలుగుచూశాయి. అయితే, దేశవ్యాప్తంగా గత వారం రోజులుగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ కోవిడ్ -19 కోసం సవరించిన మార్గదర్శకాలను జారీ చేసింది. బాక్టీరియల్ ఇన్ఫెక్షన్ క్లినికల్ అనుమానం ఉంటే తప్ప యాంటీబయాటిక్స్ ఉపయోగించకూడదని పేర్కొంది. కోవిడ్ -19 ఇతర స్థానిక అంటువ్యాధులతో సంక్రమించే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది.
"బ్యాక్టీరియా సంక్రమణపై క్లినికల్ అనుమానం ఉంటే తప్ప యాంటీబయాటిక్స్ వాడకూడదు. కోవిడ్-19 ఇతర స్థానిక అంటువ్యాధులతో సంక్రమించే అవకాశాన్ని పరిగణనలోకి తీసుకోవాలి. దైహిక కార్టికోస్టెరాయిడ్స్ తేలికపాటి వ్యాధిలో సూచించబడవు" అని కొవిడ్ కొత్త మార్గదర్శకాలు పేర్కొన్నాయి. "శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, హైగ్రేడ్ జ్వరం/ తీవ్రమైన దగ్గు, ముఖ్యంగా 5 రోజుల కంటే ఎక్కువ కాలం ఉంటే వెంటనే వైద్య సహాయం తీసుకోండి. హైరిస్క్ లక్షణాలు ఉన్నవారికి తక్కువ పరిమితి విధించాలి" అని కరోనా వైరస్ మార్గదర్శకాల్లో పేర్కొన్నారు.