ట్రంప్‌తో చేయి కలిపిన కేసీఆర్, కాసేపు ముచ్చట్లు

By Siva KodatiFirst Published Feb 25, 2020, 8:26 PM IST
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ చేయి కలిపారు. ట్రంప్ గౌరవార్థం మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో ఇస్తున్న విందుకు కే.చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. కేసీఆర్‌ను ట్రంప్‌కు పరిచయం చేశారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు తెలంగాణ సీఎం కేసీఆర్ చేయి కలిపారు. ట్రంప్ గౌరవార్థం మంగళవారం రాష్ట్రపతి భవన్‌లో ఇస్తున్న విందుకు కే.చంద్రశేఖర్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్.. కేసీఆర్‌ను ట్రంప్‌కు పరిచయం చేశారు. ఈ క్రమంలో ఇద్దరు కాసేపు ముచ్చటించుకున్నారు. ఈ దృశ్యాన్ని అక్కడి కెమెరాలు క్లిక్‌మనిపించాయి. 

Also Read:ట్రంప్‌తో విందుకు కేసీఆర్: ఇవాంక, మెలానియాలకు స్పెషల్ గిఫ్ట్

విశిష్ట అతిథి ట్రంప్ కోసం ఏర్పాటుచేసిన ఈ విందుకు అతి తక్కువగా అంటే కేవలం 90 నుంచి 95 మంది అథితులకు మాత్రమే రాష్ట్రపతి ఆహ్వానించారు.ప్రధాని మంత్రి నరేంద్ర మోడీతో సహా కేవలం కొద్దిమంది కేంద్ర మంత్రులకు మాత్రమే రాష్ట్రపతి ఆహ్వానం అందింది.

రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణ సీఎంతో పాటు అస్సాం, హర్యానా, కర్ణాటక, బీహార్, మహారాష్ట్ర, తమిళనాడు, ఒడిశాలకు  చెందిన మొత్తం 8 మంది ముఖ్యమంత్రులకు మాత్రమే రాష్ట్రపతి భవన్ నుంచి ఆహ్వానం అందింది.

Aslo Read:డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటన... సీఎం కేసీఆర్ కు అరుదైన అవకాశం

మంగళవారం సాయంత్రం ఢిల్లీ చేరుకున్న కేసీఆర్.. ట్రంప్, ఆయన సతీమణి మెలానియా, కుమార్తె ఇవాంకలకు కేసీఆర్ ప్రత్యేక బహుమతులు అందించనున్నారు. ట్రంప్‌కు పోచంపల్లి శాలువా కప్పి చార్మినార్ మెమెంటోను బహకరించనున్నారు. అనంతరం మెలానియా, ఇవాంకల కోసం ప్రత్యేకంగా డిజైన్ చేయించిన పోచంపల్లి, గద్వాల్ చీరలను కేసీఆర్ అందజేయనున్నారు

click me!