మిత్రుని కోసం మెనూ మార్చిన మోడీ: రాష్ట్రపతి భవన్‌లో ట్రంప్‌ భోజనమిదే..!!

By Siva KodatiFirst Published Feb 25, 2020, 8:08 PM IST
Highlights

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌కు నోరూరించే వంటకాలను సిద్ధం చేస్తోంది రాష్ట్రపతి భవన్. ట్రంప్ దంపతుల కోసం ఇండియన్, అమెరికన్ వెరైటీలను వడ్డించనున్నారు. భారతీయ ఆహ్వానం, ఆతిథ్యం, వైవిధ్యం, ప్రతీ క్షణం గుర్తిండిపోయేలా రాష్ట్రపతి భవన్ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌‌కు నోరూరించే వంటకాలను సిద్ధం చేస్తోంది రాష్ట్రపతి భవన్. ట్రంప్ దంపతుల కోసం ఇండియన్, అమెరికన్ వెరైటీలను వడ్డించనున్నారు. భారతీయ ఆహ్వానం, ఆతిథ్యం, వైవిధ్యం, ప్రతీ క్షణం గుర్తిండిపోయేలా రాష్ట్రపతి భవన్ వర్గాలు ప్లాన్ చేస్తున్నాయి.

తొలుత ట్రంప్ దంపతులకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ దర్బార్‌ హాల్‌ బయటకు వచ్చి స్వాగతం పలకనున్నారు. అనంతరం ఆయనను రాష్ట్రపతి భవన్‌లోని ప్రతిష్టాత్మకమైన అశోకా హాల్‌లోకి తీసుకు వెళతారు.

Also Read:మోడీ ఎంతో ఇమ్రాన్ అంతే: కాశ్మీర్‌పై ట్రంప్ వ్యాఖ్యలు ఇవీ

అతిథులంతా అశోకా హాల్‌కు చేరుకునే వరకు కోవింద్-ట్రంప్‌లు హాల్‌కు ఉత్తరం వైపునున్న డ్రాయింగ్‌ రూమ్‌లో ఏకాంతంగా చర్చలు జరపనున్నారు. అనంతరం ట్రంప్, మెలానియా, ఇవాంక, జారెద్ కుష్నర్‌లకు రాష్ట్రపతి బహుమతులు అందజేయనున్నారు.

ఇక మెను విషయానికి వస్తే నాన్ వెజ్, వెజ్, స్వీట్లు, డిసెర్ట్స్, అపిటైజర్స్‌ ఉన్నాయి. విందు ప్రారంభానికి ముందు ఐదు రకాల స్వీట్లు, డెసర్ట్స్‌ను అతిథుల కోసం సిద్ధం చేస్తున్నారు. ఇందులో ఆలూ టిక్కీ, పాలక్ పాపడ్ ఉన్నాయి.

రాష్ట్రపతి భవన్ ఫేమస్ వంటకం దాల్ రైసినాతో పాటు పుట్టగొడుగుల కూర, మేక మాంసంతో దమ్ బిర్యానీ, కుండ బిర్యానీ ఉన్నాయి. ఇక ట్రంప్ విందులో ఉపయోగించిన పుట్టగొడుగుల్ని హిమాలయాల నుంచి తెప్పించారు. వీటి ధర కేజీ 30 వేల రూపాయలు.

Also Read:సీఏఏపై ఇలా: ఢిల్లీ అల్లర్లపై తెలివిగా తప్పించుకున్న ట్రంప్

దీనితో పాటు భారత తీరంలో దొరికే అరుదైన సాల్మన్ చేపలతో టిక్కాను తయారు చేయనున్నారు. సాల్మన్ ఫిష్ టిక్కాపై అమెరికా సుగంధ ద్రవ్యాలతో తయారైన మసాలాను చల్లుతారు.

మేక పిల్లల కాళ్ల మాంసాన్ని నిప్పులపై కాల్చి గ్రిల్ తరహాలో వడ్డించనున్నారు. ఇక స్వీట్లంటే ఎంతగానో ఇష్టపడే ట్రంప్‌ కోసం పాలతాలికలతో చేసిన బొబ్బట్లు, హేజల్ నట్ యాపిల్ పై, సాల్టీ కారమెల్ సాస్‌తో తయారు చేసిన వెనిలా ఐస్‌క్రీమ్ సిద్దం చేశారు. 

click me!