లాలూ గెటప్ లో తేజ్ ప్రతాప్ యాదవ్..!

Published : Jul 06, 2021, 01:09 PM IST
లాలూ గెటప్ లో తేజ్ ప్రతాప్ యాదవ్..!

సారాంశం

ఈ కార్యక్రమానికి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వర్చువల్ మాధ్యమంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. 

బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ తనయుడు తేజ్ ప్రతాప్ యాదవ్.. కొత్త లుక్ లో దర్శనమిచ్చాడు. రాష్ట్రీయ జనతాదళ్ ఏర్పాటై 25 ఏళ్ల పూర్తయిన సందర్భంగా బీహార్ రాజధాని పట్నాలో పార్టీ ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ వర్చువల్ మాధ్యమంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించారు. 

ఈ సందర్బంగా లాలూ కుమారుడు తేజశ్వీ యాదవ్.. నితీష్ సర్కారుపై విమర్శలు గుప్పించారు. కుమారుని ప్రసంగం విన్న లాలూ పొంగిపోతూ, అభినందనలు కురిపించారు.  దీంతో అక్కడున్న కార్యకర్తలంతా పెద్దపెట్టున కరతాళ ధ్వనులు చేశారు. తేజ్ ప్రతాప్ తన ప్రసంగంలో పలు చమక్కులు విసిరారు.

 ప్రత్యర్థులు తనను చూడగానే మరో లాలూ అని అంటారని, తాను తండ్రి మార్గంలో నడుస్తుంటానని అన్నారు. పార్టీని ముందుకు తీసుకువెళ్లేందుకు తాను విషపు గోళీలను మింగడానికి కూడా సిద్ధమని పేర్కొన్నారు.  కాగా.. గతంలో. తేజ్  ప్రతాప్ యాదవ్.. ఈశ్వరుని గెటప్ లో.. ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇప్పుడు.. లాలూ ప్రసాద్ యాదవ్ గెటప్ లో కనిపించడం గమనార్హం.

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్