మద్యం రుచి మరిగిన ఎలుకలు.. ఏకంగా 12 బాటిళ్లు ఖాళీ...!

Published : Jul 06, 2021, 11:14 AM IST
మద్యం రుచి మరిగిన ఎలుకలు.. ఏకంగా 12 బాటిళ్లు ఖాళీ...!

సారాంశం

ఎలుకలు మద్యం తాగిన ఘటన మరోసారి తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది. కరోనా సంక్షోభం అనంతరం మద్యం దుకాణం తెరిచిన తమిళనాడు ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు 12 ఖాళీ వైన్ బాటిళ్లను చూసి షాక్ కు గురయ్యారు. ఈ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. 

తమిళనాడులో వింత ఘటన జరిగింది. ఎలుకలు ఏకంగా మందుకు అలవాటు పడ్డాయి. ఏదో రుచి చూసి వదిలేస్తే ఓకే.. కానీ అదే పనిగా 12 బాటిళ్లు తాగేశాయి. ఇంకొన్ని రోజులు దుకాణాలు మూసి ఉంటే ఇంకెన్ని బాటిళ్లు ఖాళీ చేసేవో.. తెలియదు కానీ... ఎలుకలు మద్యానికి అలవాటు పడడం మాత్రం విచిత్రమే. ఈ సంఘటన తమిళనాడులో జరిగింది. 

ఎలుకలు మద్యం తాగిన ఘటన మరోసారి తమిళనాడు రాష్ట్రంలో వెలుగు చూసింది. కరోనా సంక్షోభం అనంతరం మద్యం దుకాణం తెరిచిన తమిళనాడు ఎక్సైజ్ శాఖ ఉద్యోగులు 12 ఖాళీ వైన్ బాటిళ్లను చూసి షాక్ కు గురయ్యారు. ఈ ఘటన తమిళనాడులో వెలుగు చూసింది. 

తమిళనాడులోని నీలగిరి జిల్లా గుడలూరు సమీపంలోని కదంపూజ పట్టణంలో ప్రభుత్వం మద్యం దుకాణం నడుపుతోంది. కరోనా వ్యాప్తితో లాక్ డౌన్ వల్ల ఈ దుకాణాన్ని మూసేశారు. దీంతో ఎలుకలు బాటిళ్ల మూతలను కొరికి వైన్ తాగాయని తేలింది. దుకాణంలోని 12 క్వార్టర్ మద్య బాటిళ్ల మూతలు ఎలుకలు కొరికి ఉన్నట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు కనుగొన్నారు. ఎలుకలు మద్యం తాగిన ఘటన మీద సీనియర్ ఎక్సైజ్ శాఖ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్