దేశంలో పలు రాష్ట్రాల గవర్నర్లను కేంద్రం నియమించింది. విశాఖపట్టణం మాజీ ఎంపీ హరిబాబుకు గవర్నర్ పదవి దక్కింది. ఆయనను మిజోరాం గవర్నర్ గా నియమించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయను హర్యానాకు బదిలీ చేశారు. కర్ణాటక రాష్ట్ర గవర్నర్ గా తవర్ చంద్ గెహ్లాట్ ను నియమించారు. మంగుభాయ్ చంగభాయ్ పటేల్ ను మధ్యప్రదేశ్ గవర్నర్ గా నియమించారు. బండారు దత్తాత్రేయ స్థానంలో హిమచల్ ప్రదేశ్ గవర్నర్ గా రాజేంద్రన్ విశ్వనాథ్ అర్లెకర్ ను నియమించారు.
దేశంలో పలు రాష్ట్రాల గవర్నర్లను కేంద్రం నియమించింది. విశాఖపట్టణం మాజీ ఎంపీ హరిబాబుకు గవర్నర్ పదవి దక్కింది. ఆయనను మిజోరాం గవర్నర్ గా నియమించారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయను హర్యానాకు బదిలీ చేశారు. కర్ణాటక రాష్ట్ర గవర్నర్ గా తవర్ చంద్ గెహ్లాట్ ను నియమించారు.
మంగుభాయ్ చంగభాయ్ పటేల్ ను మధ్యప్రదేశ్ గవర్నర్ గా నియమించారు. బండారు దత్తాత్రేయ స్థానంలో హిమచల్ ప్రదేశ్ గవర్నర్ గా రాజేంద్రన్ విశ్వనాథ్ అర్లెకర్ ను నియమించారు.గోవా గవర్నర్ గా పీఎస్ శ్రీధరన్ పిళ్లైకు బాధ్యతలు అప్పగించారు. త్రిపుర గవర్నర్ గా సత్యదేవ్ నారాయణ్ ఆర్య, జార్ఖండ్ గవర్నర్ గా రమేష్ బాయ్ ను నియమించారు.
కేంద్ర మంత్రివర్గ విస్తరణ సాగుతుందనే ఊహగానాలు వెలువడుతున్న తరుణంలో గవర్నర్ల నియామకం, బదిలీలపై రాజకీయంగా ప్రాధాన్యత చోటు చేసుకొంది. హరిబాబుకు బీజేపీ నాయకత్వం ప్రాధాన్యత ఇస్తోందని కొంత కాలంగా ప్రచారం సాగుతోంది. గత టర్మ్ లో కేంద్ర మంత్రివర్గంలోకి హరిబాబును తీసుకొంటారని ప్రచారం సాగింది. కానీ ఆయనకు ఎలాంటి పదవి దక్కలేదు.ఈ దఫా హరిబాబుకు గవర్నర్ పదవి లభించింది.గత టర్మ్ లో కేంద్ర మంత్రిగా పనిచేసిన బండారు దత్తాత్రేయను గవర్నర్ గా నియమించారు.