అర్థరాత్రి ఇంట్లోకి దూరి...15యేళ్ల బాలికపై అత్యాచారం.. తండ్రిని చూసి పరార్...

Published : Sep 28, 2021, 04:23 PM IST
అర్థరాత్రి ఇంట్లోకి దూరి...15యేళ్ల బాలికపై అత్యాచారం.. తండ్రిని చూసి పరార్...

సారాంశం

రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాకు చెందిన అంకిత్ అనే వ్యక్తి  తన ప్రాంతంలో నివసిస్తున్న15 ఏళ్ల యువతిపై కన్నేశారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న అతను ఓ రోజు అర్థరాత్రిసమయంలో ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాడు.

రాత్రి కూతురు గది నుంచి ఏదో అలజడి రావడంతో తండ్రి నిద్రలేచాడు. ఏమైందో అని అక్కడికి వెళ్తుంటే గదిలోనుంచి ఓ వ్యక్తి పారిపోవడం గమనించాడు. పట్టుకుందాం అనుకునే లోపే అతను పారిపోయాడు. దొంగతనం చేయడానికి వచ్చాడేమో అని తండ్రి అనుమానించాడు. కానీ ఆ తర్వాత అసలు విషయం చెప్పడంతో కుప్పకూలిపోయాడు.

రాజస్థాన్లోని భరత్పూర్ జిల్లాకు చెందిన అంకిత్ అనే వ్యక్తి  తన ప్రాంతంలో నివసిస్తున్న15 ఏళ్ల యువతిపై కన్నేశారు. అవకాశం కోసం ఎదురు చూస్తున్న అతను ఓ రోజు అర్థరాత్రిసమయంలో ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళాడు. పై గదిలో ఒంటరిగా ఉన్న ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. కింద గదిలో పడుకున్న తండ్రికి పై గది నుంచి ఏవో శబ్దాలు రావడంతో నిద్రలేచాడు. ఏమైందోనని పైకి వెళుతుండగా కూతురు గది నుంచి ఓ యువకుడు పారిపోవడం గమనించాడు.

కొవాగ్జిన్‌ టీకాకు డబ్ల్యూహెచ్‌వో మరోసారి షాక్.. అత్యవసర వినియోగ అనుమతి వాయిదా..

మొదట దొంగేమో అని  అనుకున్నాడు. కానీ కూతురు గదిలోకి వెళ్లి గమనించగా ఏదో అనుమానం కలిగింది. కూతుర్ని ప్రశ్నించగా ఆమె జరిగిన విషయం తండ్రికి చెప్పింది.  అది విని తండ్రి షాక్కు గురయ్యాడు. అంకిత్ అనే వ్యక్తి తనని అత్యాచారం చేశాడని తెలిపింది. నోట్లో గుడ్డలు కుక్కి, అరిస్తే చంపేస్తానని బెదిరించి తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడని వివరించింది.  పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.

PREV
click me!

Recommended Stories

Tamilnadu Incidnt : నిందితుడికి రెండు మరణశిక్షలు | Asianet News Telugu
Coimbatore Child Case: 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగితే జోకులేంటి... సస్పెండ్ చేసిన సీఎం విజయ్