స్మార్ట్ ఫోన్ కోసం.. ఏకంగా తన రక్తాన్ని అమ్ముకున్న యువతి...!

By telugu news teamFirst Published Oct 20, 2022, 9:36 AM IST
Highlights

ఓ టీనేజ్ అమ్మాయి తనకు కావాల్సిన ఫోన్ కొనుక్కోవడం కోసం తన శరీరంలోని రక్తాన్ని అమ్ముకుంది. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం

ఖరీదైన స్మార్ట్ ఫోన్ వాడాలనే కోరిక ఈ రోజుల్లో చాలా మంది యువతల్లో ఉంటుంది. ఇది చాలా  కామన్. అయితే... ఆ ఫోన్ ని సొంతం చేసుకోవడానికి ఎవరైనా ఏం చేస్తారు...? చదువుకునే పిల్లలు అయితే తమ పేరెంట్స్ అని అడిగి కొనిపిచ్చుకుంటారు. ఉద్యోగాలు చేసేవారు వారి సొంత డబ్బుతోనే కొనుక్కుంటారు. కానీ... ఓ టీనేజ్ అమ్మాయి తనకు కావాల్సిన ఫోన్ కొనుక్కోవడం కోసం తన శరీరంలోని రక్తాన్ని అమ్ముకుంది. నమ్మసక్యంగా లేకపోయినా ఇది నిజం. ఫోన్ కోసం తన రక్తం అమ్మింది ఈ సంఘటన బెంగాల్ రాష్ట్రం దినాజ్ పూర్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.


బెంగాల్ లోని దినాజ్ పూర్ కి చెందిన 16ఏళ్ల యువతి 12వ తరగతి చదువుతోంది. ఇటీవల బాలిక 9 వేలు విలువ చేసే స్మార్ట్ ఫోన్ ని ఆన్ లైన్ లో ఆర్డర్ చేసింది. అయితే.... అంత డబ్బు ఆమె దగ్గర లేకపోవడంతో... ఎలాగైనా వాటిని సంపాదించాలని అనుకుంది. ఈ క్రమంలో ఆమె  బలూర్‌ఘాట్‌లోని జిల్లా ఆసుపత్రికి చేరుకుని డబ్బుకు బదులుగా తన రక్తాన్ని విక్రయించాలని నిర్ణయించుకుంది.

రక్తం ఇవ్వడానికి బదులుగా అమ్మాయి డబ్బు డిమాండ్ చేయడంతో ఆసుపత్రి సిబ్బంది  షాక్ అయ్యారు. బ్లడ్ బ్యాంక్ ఉద్యోగి కనక్ దాస్  ఈ విషయం గురించి మాట్లాడుతూ...రక్తదానం చేయడానికి బదులుగా బాలిక డబ్బు డిమాండ్ చేయడంతో తమకు అనుమానం వచ్చిందని చెప్పారు.

ఆసుపత్రి సిబ్బంది వెంటనే ఆసుపత్రికి చేరుకున్న శిశు సంరక్షణ విభాగానికి సమాచారం అందించారు. విచారణ అనంతరం అసలు కారణం తెలుసుకున్నారు.

చైల్డ్ కేర్ మెంబర్ రీటా మహ్తో బాలికను రక్తం ఎందుకు ఇస్తున్నావు.? డబ్బులు ఎందుకు అడుగుతున్నావు..? అని ప్రశ్నించారు. అందుకు ఆ బాలిక చెప్పిన సమాధానం విని వారు షాక్ అయ్యారు. తాను ఆన్ లైన్ లో ఫోన్ ఆర్డర్ చేశానని.. అది డెలివరీ చేసినప్పుడు డబ్బులు చెల్లించాల్సి ఉందని.. దాని కోసమే రక్తం అమ్మాలని నిర్ణయం తీసుకున్నట్లు చెప్పడం విశేషం. 

click me!