లాక్ డౌన్: మిత్రుడ్ని సూట్ కేసులో పెట్టి.... అపార్టుమెంటులోకి....

By telugu team  |  First Published Apr 13, 2020, 7:16 AM IST

కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో విధించిన లాక్ డౌన్ తో విసిగిపోయిన ఓ టీనేజర్ విచిత్రమైన పనికి ఒడిగట్టాడు. మంగళూరులో ఓ టీనేజర్ తన మిత్రుడిని సూట్ కేసులో పెట్టి తీసుకుని వెళ్లడానికి ప్రయత్నించాడు.


బెంగళూరు: దేశవ్యాప్తంగా కరోనావైరస్ మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో ఓ యువకుడు విసిగిపోయి విచిత్రమైన పనికి ఒడిగట్టాడు. కర్ణాటకలోని మంగళూరులో ఓ టీనేజీ కుర్రాడు తన మిత్రుడిని సూట్ కేసులో పెట్టుకుని అపార్టుమెంటులోకి తీసుకుని వెళ్లే ప్రయత్నం చేశాడు. 

అతని ప్రయత్నం ఫలించలేదు. ఆపార్టుమెంటులోకి సూట్ కేసుతో వెళ్తున్న అతన్ని పట్టుకున్నారు. ఆపార్టుమెంటులోకి బయటవాళ్లు రాకుండా కట్టడి చేశారు. దాంతో తీవ్ర నిరాశకు గురైన యువకుడు తన మిత్రుడిని సూట్ కేసులో పెట్టి లోనికి తీసుకుని వెళ్లడానికి ప్రయత్నించాడు. 

Latest Videos

భారీ సూట్ కేసులో కదలికలు చోటు చేసుకోవడంతో అనుమానించిన అపార్టుమెంంటు యజమానులు అతన్ని పట్టుకున్నారు. సూట్ కేసును తెరిచి చూశారు. వెంటనే అతని మిత్రుడు దాంట్లోంచి బయటకు రావడాన్ని చూశారు. వెంటనే వాళ్లు పోలీసులకు సమాచారం అందించారు. 

పోలీసులు వచ్చిన వారిద్దరినీ స్టేషన్ కు తీసుకుని వెళ్లారు. వెంటనే ఇద్దరు పిల్లల తల్లిదండ్రులను స్టేషన్ కు పిలిపించారు. దీనిపై పోలీసులు ఏ విధమైన కేసును కూడా నమోదు చేయలేదు. 

click me!