
భాదోహి: భర్తతో గొడవ పడిన ఓ మహిళ అత్యంత దారుణమైన చర్యకు ఒడిగట్టింది. భర్తతో గొడవ పడిన మహిళ తన ఐదుగురు పిల్లలను గంగానదిలో పడేసినట్లు పోలీసులు తెలిపారు. పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఈ సంఘటన జరిగింది.
మంజు యాదవ్, మృదుల్ యాదవ్ గత ఏడాది కాలంగా కుటుంబ విషయాలపై గొడవపడుతూ పస్తున్నారు. పిల్లలను నదిలో పడేసి చంపాలని ఆమె ఆలోచించిందని పోలీసులు చెప్పారు.
శనివారం రాత్రి భర్తతో గొడవ పడిన మంజు తన ఐదుగురు పిల్లలను నదిలో పడేసింది. జహీంగరాబాద్ ఘాట్ వద్ద పిల్లలను ఆమె నదిలో పడేసింది. అక్కడ నీరు చాలా లోతుగా ఉంటుంది.
కొంత మంది మత్స్యకారులు పిల్లల అరుపులు విన్నారని, చీకట్లో వారి అరుపులు వినిపించడంతో భయపడి పారిపోయారని అంటున్నారు. పిల్లలను నదిలో పడేసిన తర్వాత మహిళ ఒడ్డునే ఉండిపోయింది. తెల్లారి గ్రామస్తులకు విషయం చెప్పింది.