13యేళ్ల బాలికపై టీనేజ్ బాలుడి అఘాయిత్యం... ఇంట్లో తెలియడంతో పరార్..

Published : Jun 11, 2022, 11:42 AM IST
13యేళ్ల బాలికపై టీనేజ్ బాలుడి అఘాయిత్యం... ఇంట్లో తెలియడంతో పరార్..

సారాంశం

పంజాబ్ లో దారుణం చోటు చేసుకుంది. ఓ 13యేళ్ల బాలికమీద టీనేజ్ యుకవుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. విషయం బైటికి రావడంతో అతను పరారీలో ఉన్నాడు. 

చండీగర్ :  నిర్భయ లాంటి కఠిన చట్టాలు ఉన్నప్పటికీ కామాంధులు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. తాజాగా పంజాబ్ లో  దారుణం చోటుచేసుకుంది. ఓ యువకుడు ఇంట్లో ఒంటరిగా ఉన్న 13 ఏళ్ల బాలికను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన పంజాబ్లోని మౌళి జాగరణ్ లో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…  మౌళి జాగరణ్ ప్రాంతానికి చెందిన యువకుడు… మార్చి నెలలో పంచకులలోని బుద్దన్ పూర్ గ్రామంలో ఇంట్లో ఉన్న బాలికపై అత్యాచారానికి  పాల్పడ్డాడు. ఆ తర్వాత తనను బెదిరించి మరోసారి తన ఇంట్లోనే జూన్ 8వ తేదీన లైంగిక దాడి చేశాడు.  అలా పలుమార్లు తనపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

బాలికలో మార్పులను గమనించిన తల్లిదండ్రులు ఆమెను ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో  బాధిత బాలిక, ఆమె తల్లి చండీగడ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు యువకుడిపై ఐపీసీ సెక్షన్ 376 (2), 506, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేశారు. అయితే, నిందితుడు బాలుడని అని తెలుస్తుంది.  ప్రస్తుతం పరారీలో ఉన్న బాలుడి కోసం గాలిస్తున్నట్లు చండీగఢ్ పోలీసులు వెల్లడించారు.

ఇదిలా ఉంటే కిషన్ గడ్ గ్రామంలో బాలికను లైంగికంగా వేధించినట్లు ఆటోరిక్షా డ్రైవర్ ను అరెస్టు చేశారు.  అదే గ్రామంలోని బాలికను నిందితుడు హరిశంకర్ లైంగిక వేధింపులకు గురి చేసినట్లు ఫిర్యాదు అందడంతో అతన్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. 

gang rape : దారుణం.. 12 ఏళ్ల బాలిక‌ను తుపాకీతో బెదిరించి గ్యాంగ్ రేప్.. చ‌ర్య‌లు తీసుకోని పోలీసులు

కాగా, ‘మీ బాబాయ్ కి చెప్పి కొట్టిస్తా.. అని బెదిరించి ఓ auto driver బాలికపై sexual harassmentకి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి. ntr nagarకు చెందిన తొమ్మిదేళ్ల బాలిక తల్లితో కలిసి ఉంటోంది. వారి ఎదురింట్లో ఉంటున్న షేక్ సలీం (30) ఆటో డ్రైవర్ గా పని చేస్తున్నాడు. అతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను తరచుగా గొడవ పడుతుండడంతో కొద్ది రోజుల క్రితం అతని భార్య పుట్టింటికి వెళ్లిపోయింది.

మూడు నెలలుగా ఒంటరిగా ఉంటున్న సలీమ్  అతని ఇంటి ఎదురుగా ఉన్న బాలిక మీద కన్నేశాడు. మూడు రోజులుగా పలుమార్లు ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. సదరు బాలికకు ఆమె బాబాయ్ అంటే భయం ఉండడంతో... ఈ విషయం బయటికి చెబితే మీ బాబాయ్ కి చెప్పి కొట్టిస్తానని బెదిరించడంతో ఆమె భయపడి ఎవ్వరికీ చెప్పలేదు. అయితే, గురువారం బాధితురాలు సలీమ్ ఇంట్లో నుంచి రావడాన్ని గుర్తించిన పక్కన ఉండే మరో మహిళ... తల్లి దృష్టికి తీసుకువెళ్లింది. దీంతో ఆమె బాలికను నిలదీయడంతో మూడు రోజులుగా సలీం తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు చెప్పింది. 

దీంతో ఆమె స్థానికుల సహాయంతో సలీమ్ ను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పజెప్పారు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం వనస్థలిపురంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడు షేక్ సలీంను ఎల్బీనగర్ పోలీస్  అరెస్టు చేశారు. శుక్రవారం అతడిని కోర్టులో హాజరు పరిచారు. 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu