ప్రియురాలితో సరదాగా గడపాలని వస్తే.. మరో యువతితో కనిపించింది.. మనస్తాపంతో ఆ యువకుడు చేసిన పని..

Published : Feb 06, 2023, 10:05 AM IST
ప్రియురాలితో సరదాగా గడపాలని వస్తే.. మరో యువతితో కనిపించింది.. మనస్తాపంతో ఆ యువకుడు చేసిన పని..

సారాంశం

వీకెండ్ లో ప్రియురాలితో సరదాగా గడుపుదామని వస్తే ఆమె మరో యువతితో తన అపార్ట్ మెంట్లో కనిపించింది. దీంతో ప్రియురాలితో గొడవ పడి 20 అంతస్తుల బిల్డింగ్ మీదినుంచి దూకి మరణించారు. 

బెంగళూరు : ఓ యువతీ, యువకుడు ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఇద్దరు కలిసి సరదాగా గడిపేవారు. తరచుగా కలుసుకునేవారు. అలాగే ఈ వీకెండ్ లో తన ప్రియురాలితో సరదాగా గడపాలని అనుకున్న యువకుడు నోయిడాలోని ఆమె ఇంటికి వెళ్ళాడు. అపార్ట్మెంట్లో ఆమెతో కలిసి మందు కూడా తాగాడు. ఆ తర్వాత ఓ అమ్మాయి విషయంలో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. అది కాస్త పెద్దది అవ్వడం, అప్పటికే మద్యం సేవించి ఉండడంతో ఇద్దరూ ఒకరి మీద ఒకరు  గట్టిగా కేకలు వేసుకున్నారు. విపరీతమైన కోపానికి వచ్చిన యువకుడు అపార్ట్మెంట్లోని 20వ అంతస్తు నుంచి దూకి చనిపోయాడు. 

అతని దూకిన సమయంలో ఓ మహిళ మీద పడడంతో ఆమె కూడా తీవ్రగాయాల పాలయింది. దీనిమీద కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. విచారణ చేపట్టారు. ఈ ఘటన బెంగళూరులో కలకలం రేపింది. ఓ ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్న బెంగళూరుకు చెందిన ఓ యువకుడు తన ప్రియురాలిని చూడడానికి నోయిడాకు వెళ్ళాడు. అయితే అతను వస్తున్నాడని ముందే తెలిసినా.. ఆమెతోపాటు మరో యువతి కూడా  ఆమె రూమ్లో ఉంది. ఆ ముగ్గురు కలిసి మందు తాగారు. సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆమె బయటికి వెళ్లిపోయింది. 

అమెరికాలోని కొలరాడోలో కాల్పులు.. ఒకరి మృతి, నలుగురికి గాయాలు..

అయితే,  నేను వస్తున్నానని తెలిసిన ఆమెను ఎందుకు పిలిచావ్ అంటూ ఆ యువకుడు  తన ప్రేమికురాలిపై  సీరియస్ అయ్యాడు. వాదనతో మొదలైన గొడవ అతని ఆత్మహత్యతో ముగిసింది. అయితే ఈ సమయంలో అతను గొడవ గొడవ పడుతున్నాడు అన్న విషయాన్ని సెక్యూరిటీ గార్డుకు ఫిర్యాదు చేసేందుకు యువతి కిందికి వెళ్ళింది. దీంతో యువకుడు అపార్ట్మెంట్ మీద నుంచి దూకేశాడు. ఆ సమయంలో గ్రౌండ్ ఫ్లోర్లో ఓ మహిళ భోజనం చేస్తుంది. నేరుగా ఆమె మీద పడ్డాడు.  దీంతో ఆమె తీవ్ర గాయాలపాలయ్యింది. అది చూసినవారు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ ప్రారంభించారు. 

PREV
click me!

Recommended Stories

Bharathiraja: భారతిరాజాకి నివాళి అర్పించిన తమిళ సినీ ప్రముఖులు | Asianet News Telugu
ఎవ్వరికీ సాధ్యం కాని మోదీ హిస్టారికల్ రికార్డ్ | Modi Creates History | Asianet News Telugu