కారు ఇంజిన్ లో దాక్కున్న కుక్క పిల్ల...70 కిలోమీటర్ల తర్వాత...

By telugu news teamFirst Published Feb 6, 2023, 9:44 AM IST
Highlights

దాదాపు 70 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత వారికి కారులో నుంచి వారికి ఏదో శబ్దం వినపడింది.

దేవుడి దర్శనానికి వెళ్లిన ఓ కుటుంబానికి కుక్క కారణంగా వింత అనుభవం ఎదురైంది. ఓ కుక్క వారికి తెలీకుండా వారితో పాటు 70 కిలోమీటర్లు ప్రయాణించింది. వారికి తెలీకుండానే... ఓ కుక్క వారి కారులోకి ప్రవేశించింది. అది కూడా... కారు ఇంజిన్ లో దూరింది. దాదాపు 70 కిలోమీటర్లు అది ఇంజిన్ లో దూరి.. వారి వెంటే రావడం గమనార్హం. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో చోటుచేసుకోగా.... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటక రాష్ట్రం పుత్తూరు తాలుకా కబాక ప్రాంతానికి చెందిన సుబ్రహ్మణ్యం... తన కుటుంబంతో కలిసి కారులో సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్లారు. తిరిగి వస్తుండగా... సుళ్య తాలుకా బల్పా గ్రామం వద్ద సడన్ గా వారి కారు కిందకు ఓ కుక్క దూరింది. కారు కింద పడిందేమో అనే అనుమానంతో ఆయన కారును ఆపాడు. కింద చూస్తే.. కుక్క కనిపించలేదు. అది పారిపోయింది లే అని వారు అనుకున్నారు. దాదాపు 70 కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత వారికి కారులో నుంచి వారికి ఏదో శబ్దం వినపడింది. తీరా ఏంటా అని చూస్తే.... ఇంజిన్ లోకి ఆ కుక్క దూరింది. కుక్క ఇంజిన్ లోకి ఎలా దూరిందో కూడా వాళ్లకు అర్థం కాలేదు. దానిని బయటకు తీయడం సాధ్యం కాక... మెకానిక్ సహాయం తీసుకోగా.... వారు అతి కష్టం మీద దానిని బయటకు తీయాల్సి వచ్చింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట ప్రస్తుతం వైరల్ గా మారింది.

tags
click me!