
ఉపాధ్యాయ వృత్తిలో ఉండి... ఓ వ్యక్తి నీచంగా ప్రవర్తించాడు. విద్యార్థులు దారి తప్పకుండా.. వారికి మంచేదో, చెడేదో చెప్పాల్సింది పోయి... దారుణంగా ప్రవర్తించాడు. కాలేజ్ హాస్టల్ లో ఓ మహిళ తో కామ క్రీడలో పాల్గొన్నాడు. అది కాస్త విద్యార్థుల కంట పడింది. ఈ సంఘటన ఛత్తీస్ గఢ్ లో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా జిల్లా ఉప్రోడాకు చెందిన బాయ్స్ హాస్టల్‌లో ప్రదీప్ కుమార్ అనే ఉపాధ్యాయుడు పనిచేస్తూ ఉంటాడు. అతను పిల్లలను చదివిస్తూ ఉండాలి. అయితే... పిల్లలను పట్టించుకోవడం మానేసి.. అక్కడ పనిచేసే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. హాస్టల్ గదుల్లోనే ఆమెతో శృంగారం సాగించేవాడు. ఈ నెల 22వ తేదీ రాత్రి 9.30 గంటలకు ఆ మహిళను హాస్టల్ సూపరింటెండెంట్ గదికి తీసుకెళ్లాడు. అక్కడ ఆమెతో శృంగారం సాగిస్తుండగా హాస్టల్ వాచ్‌మెన్, విద్యార్థులు ఆ గదికి బయట నుంచి తాళం వేశారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.
రాత్రి అక్కడకు చేరుకున్న పోలీసులు ప్రదీప్ కుమార్‌తో పాటు మహిళను కూడా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. అనంతరం ఇద్దరినీ విచారించారు. ఈ విషయాన్ని జిల్లా విద్యాధికారికి తెలియజేశారు. ఆయన విచారణ జరిపి ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారు.