విషాదం.. బావిలో పడి యువతి.. రక్షించబోయి యువకుడు దుర్మరణం..

By SumaBala BukkaFirst Published Jan 25, 2023, 8:44 AM IST
Highlights

రాజస్థాన్ లో ఓ బావిలో ఓ యువతి, యువకుడి మృతదేహాలు లభించాయి. జిల్లాలోని స్వరూప్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్వాడ ఖల్సా గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.

జైపూర్ : రాజస్థాన్‌లోని సిరోహి జిల్లాలో మంగళవారం ఓ బావిలో 27 ఏళ్ల యువకుడు, 19 ఏళ్ల యువతి మృతదేహాలు లభ్యమైనట్లు పోలీసులు తెలిపారు. జిల్లాలోని స్వరూప్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మార్వాడ ఖల్సా గ్రామంలో ఈ ఘటన జరిగినట్లు వారు తెలిపారు.

మృతులు అర్జున్ కుమార్ మేఘ్వాల్, కుమారిలుగా గుర్తించారు. మహిళ ప్రమాదవశాత్తు బావిలో పడిపోయిందని, ఆమెను రక్షించేందుకు వ్యక్తి దూకాడని బాధిత కుటుంబ సభ్యులు తమతో చెప్పారని పోలీసు అధికారులు తెలిపారు. సిఆర్‌పిసి సెక్షన్ 174 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు వారు తెలిపారు.

కారుతో టూవీలర్ ను ఢీ కొట్టి 12. కి.మీ. లాక్కుపోయాడు.. కారుకింద ఇరుక్కుని..నరకయాతనతో ప్రాణాలు విడిచి..

ఇదిలా ఉండగా, నిరుడు జూలైలో భోపాల్ లో ఇలాంటి ఘటనే జరిగింది. బావిలో పడిన బాలుడిని రక్షించబోయి 30మంది బావిలో పడ్డారు. ఈ సంఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విదిశలో జులైలో ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. బావిలో పడిన బాలుడిని రక్షించడానికి గ్రామస్తులు ప్రయత్నించారు. ఈ ప్రయత్నంలో 30 మంది బావిలో పడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మరణించారు.  

ఇక్కడ కూడా అంతే.. బాలుడిని రక్షించడానికి ప్రయత్నించిన వారి బరువును తట్టుకోలేక బావి కుప్ప కూలింది. దీంతో వారంతా బావిలో పడిపోయారు. విదిశకు 50 కిలోమీటర్ల దూరంలో గల గంజ్ బసోడా గ్రామంలో ఈ ప్రమాదం సంభవించింది. రాత్రంతా సహాయక చర్యలు కొనసాగుతూ వచ్చాయి. బావిలో పడిన 20 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. సంఘటనపై ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించారు. బాధితులకు సరైన వైద్యం అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

click me!