రాఫెల్ ఎఫెక్ట్: ఎన్సీపీకి తారిఖ్ అన్వర్ గుడ్‌బై

By narsimha lodeFirst Published Sep 28, 2018, 3:06 PM IST
Highlights

ఎన్సీపీకి తారిఖ్ అన్వర్ గుడ్‌బై చెప్పారు. రాఫెల్ విషయంలో ప్రధానమంత్రి మోడీని  ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్  మద్దతు ప్రకటించడంతో  తారిఖన్ అన్వర్ ఎన్సీపీకి గుడ్‌బై చెప్పారు.  

న్యూఢిల్లీ: ఎన్సీపీకి తారిఖ్ అన్వర్ గుడ్‌బై చెప్పారు. రాఫెల్ విషయంలో ప్రధానమంత్రి మోడీని  ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్  మద్దతు ప్రకటించడంతో  తారిఖన్ అన్వర్ ఎన్సీపీకి గుడ్‌బై చెప్పారు.  అంతేకాదు  ఎంపీ పదవికి కూడ ఆయన  రాజీనామా చేశారు.

రాఫెల్ అంశంలో ప్రధానమంత్రి మోడీని ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ మద్దతుగా నిలవడంతో  పార్టీ పదవులకు, ఎంపీ పదవికి కూడ  తారిఖ్ అన్వర్ రాజీనామా చేశారు. బీహార్ రాష్ట్రంలోని కతియార్  నుండి  అన్వర్  ఎంపీగా కొనసాగుతున్నాడు. ఈ వారం ఆరంభంలో మరాఠీ పత్రికలతో మాట్లాడిన శరద్ పవార్  మోడీని సమర్థించారు.

రాఫెల్ విషయంలో  కాంగ్రెస్ పార్టీ తన మద్దతుదారులను కూడ సంతృప్తిపర్చలేకపోయిందని బీజేపీ ఎదురుదాడికి దిగింది.  ఈ విషయమై బీజేపీ చీఫ్ అమిత్‌షా సహా పలువురు బీజేపీ నేతలు  కూడ  కాంగ్రెస్ పై  ఎదురుదాడికి దిగారు. రాఫెల్ విషయంలో టీడీపీ మాత్రమే కాంగ్రెస్ కు కొంత వెన్నుదన్నుగా నిలిచింది. 

click me!