అద్భుత శక్తులు వస్తాయని.. చిన్నారి నరబలి

Published : Nov 06, 2018, 12:46 PM IST
అద్భుత శక్తులు వస్తాయని.. చిన్నారి నరబలి

సారాంశం

అద్భుత శక్తులు వస్తాయనే మూఢనమ్మకంతో ఓ మహిళ... మూడేళ్ల చిన్నారిని నరబలి ఇచ్చింది. 

అద్భుత శక్తులు వస్తాయనే మూఢనమ్మకంతో ఓ మహిళ... మూడేళ్ల చిన్నారిని నరబలి ఇచ్చింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రం పుదుకోట జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లో కి వెళితే.. గత నెల అక్టోబర్ 25వ తేదీన షాలిని అనే మూడేళ్ల చిన్నారి అదృశ్యమైంది. దీంతో.. చిన్నారి ఆచూకీ కోసం ఆమె కుటుంసభ్యులు గాలించారు. అయినా ఆచూకీ లభించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కాగా.. అక్కడికి దగ్గరలోని ఓ అడవి ప్రాంతంలో చిన్నారి తల, మొండెం వేరు చేసి పడవేసి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయగా.. తప్పిపోయిన షాలిని గా గుర్తించి.. వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పోలీసులు దర్యాప్తులో భాగంగా.. చిన్నపిళ్లై అనే మహిళపై కొందరు అనుమానం వ్యక్తం చేశారు.

ఆమెను అదుపులోకి తీసుకొని విచారించగా.. అద్భుత మంత్రశక్తులు సొంతం అవుతాయనే కారణంతోనే చిన్నారిని నరబలి ఇచ్చినట్లు అంగీకరించింది. కాగా.. పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. 

PREV
click me!

Recommended Stories

మహిళల కోసం వన్ స్టాప్ సెంటర్లు.. వీటివల్ల లాభాలేంటో తెలుసా?
Top 5 Dirtiest Railway Stations : దేశంలోనే అత్యంత మురికి రైల్వే స్టేషన్ ఏదో తెలుసా?