మూడు నెలలుగా సహజీవనం.. చివరకు

Published : Nov 06, 2018, 11:56 AM IST
మూడు నెలలుగా సహజీవనం.. చివరకు

సారాంశం

మూడు నెలలుగా ఓ యువతి.. మరో యువకుడితో సహజీవనం చేసింది. చివరకు ఆ సహజీవనం కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ సంఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. 

మూడు నెలలుగా ఓ యువతి.. మరో యువకుడితో సహజీవనం చేసింది. చివరకు ఆ సహజీవనం కారణంగానే ఆమె ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఈ సంఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. 

పూర్తి వివరాల్లోకి వెళితే.. జార్ఖండ్ రాష్ట్రంలోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భజనియా గ్రామానికి చెందిన 19ఏళ్ల యువతి తన లవర్ తో మూడు నెలలుగా సహజీవనం చేస్తోంది. కాగా.. అనుకోకుండా ఒకరోజు యువతి ఇంట్లో తలుపులువేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

కాగా... ఆమె ప్రియుడు ప్రియుడు ఇంటికివచ్చేసరికి తలుపులు వేసివున్నాయి. దీంతో అతను ప్రియురాలిని పిలిచినప్పటికీ ఎటువంటి సమాధానం రాలేదు. దీంతో అతను పైకప్పు నుంచి లోనికి వెళ్లాడు. అక్కడ ఆమె అచేతన స్థితిలో కనిపించింది. దీంతో వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లాడు. అక్కడ ఆమె చికిత్స పొందుతూ మృతి చెందింది. 

కాగా మృతురాలి ప్రియుడు మీడియాకు చెప్పిన వివరాల ప్రకారం వారిద్దరి మధ్య 2015 నుంచి ప్రేమ వ్యవహారం నడుస్తోంది. దీనికితోడు వారిద్దరూ మూడు నెలల నుంచి సహజీవనంలో ఉన్నారు. వీరి వ్యవహారంపై ఇరు కుటుంబాల వారు కూడా అభ్యంతరం వ్యక్తం చేయలేదు. అయితే ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియడం లేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

అయోధ్య రామమందిరానికి హై సెక్యూరిటీ.. ఎలాగో తెలుసా?
వెనిజులా తర్వాత ట్రంప్ టార్గెట్ ఈ దేశాలే..|Trump Next Target Which Country?| AsianetNewsTelugu